సీట్లు పాయే.. ప్రాధాన్యత పాయే..

Update: 2019-07-01 11:15 GMT
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పాయే అన్నట్టుగా మారిందట టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుల పరిస్థితి. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారట.. అంత ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబును కాలదన్ని బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీలు సుజనాచౌదరి- సీఎం రమేష్ లు ఇప్పుడు అనుభవిస్తున్నారన్న చర్చ సాగుతోంది. బీజేపీలో చేరినా వారిపై టీడీపీలో ఉన్నప్పుడు నమోదైన ఐటీ- ఈడీ కేసులను వెనక్కి తీసుకోవడం లేదట బీజేపీ. అంతేకాదు.. వీరికి రాజ్యసభలో ఉన్న ప్రాధాన్యతను తగ్గించడంపై కలత చెందినట్టు సమాచారం.

ఇప్పటివరకు రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీగా టీడీపీ తరుఫున గెలిచిన వీరికి మొదటి మరియు రెండో వరుసలో సీట్లు కేటాయించబడ్డాయి. దీంతో వారు రాజ్యసభలోనూ, చర్చల్లోనూ నేరుగా పాల్గొని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. కానీ ఇప్పుడు వీరు బీజేపీలో చేరడంతో కథ రివర్స్ అయ్యింది. బీజేపీ ఎంపీలుగా వీరికి వెనుకవైపు సీట్లు కేటాయించారట.. నిజానికి ఇవి చివరి వరుసలోని సీట్లు అట..దీంతో వీరు  రాజ్యసభ కెమెరాల్లో కనిపించడమే కష్టమంటున్నారు.

రాజ్యసభలో మొదటి వరుసలో పార్టీ నాయకులు, సీనియర్లు, మరియు మంత్రులకు కేటాయించారు. ఇప్పుడు సుజనా- సీఎం రమేష్ లు బీజేపీలో చేరి అతి తక్కువ టైం కావడం.. కొత్త ఎంపీలు కావడంతో వీరి సీట్లు చివరన వేశారు. దీంతో ఇన్నాళ్లు ముందు వరుసలో కూర్చొని ఫేమస్ అయిన వీరికి ఇది అవమానంగా తయారైంది.

ఇలా బీజేపీలో చేరగానే తమ కేసులు మాఫీ అయ్యి తమకు ప్రాధాన్యత దక్కుతుందని భావించిన సుజనా- సీఎం రేమేష్ - టీజీ- గరికపాటిలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇలా నిండా మునిగిన నేతలుగా వీరు మారిపోయారు.

Tags:    

Similar News