ఎంత రాజకీయాలైతే మాత్రం ఒక పద్దతి పాడు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటం సరి కాదుగా? ప‌్రజలేమీ పిచ్చోళ్లు కాదుగా. ఓవైపు అన్ని చూస్తున్నా.. ఏమనుకుంటే ఏం అన్నట్లుగా బరి తెగించినట్లుగా మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. కానీ.. ప్రస్తుతం ఫస్ట్రేషన్లో ఉన్న ఏపీ తెలుగు తమ్ముళ్లు తామేం మాట్లాడుతున్నామో తెలీనట్లుగా ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు.
ఏపీకి మోడీషాలు మోసం చేసిన మాట ఎంత వాస్తవమో.. ఆ మోసానికి అంతో ఇంతో సాయం చేసిన పాపం బాబు అండ్ కోకు ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మిత్రులుగా ఉన్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొచ్చే తెలుగు తమ్ముళ్లు.. తమతో బంధం తెంచుకున్న వారి విషయంలో పెట్రేగిపోయి మాట్లాడే తీరు అభ్యంతరకరంగా ఉందని చెప్పక తప్పదు. 2014 ఎన్నికల వేళలో జనసేన అధినేత పవన్ తో దోస్తీకి బాబు పడిన ఆరాటం అంతా ఇంతా కాదు.
పవన్ మిత్రత్వంపై తన సన్నిహితుల దగ్గర బాబు చెప్పిన మాటల్ని ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు ఫ్రెండ్ షిప్ పుటుక్కుమంటే మాత్రం.. ఇష్టం వచ్చినట్లుగా మాటలు అనేయకూడదు కదా? పవన్ ను ఉద్దేశించి బాబుకు జానీ జిగిరీ అయిన సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండి పడుతున్నారు.
సిద్ధాంతపరంగా.. మరేదైనా ఇష్యూ పరంగా పవన్ ఏదైనా తప్పు చేస్తే నిలదీయటం తప్పు కాదు. కానీ.. సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తెచ్చి బద్నాం చేయాలన్నట్లుగా ఉన్న తీరు ఏ మాత్రం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తమకు ప్రత్యర్థిగా మారిన పవన్ ను ఉద్దేశించి సీఎం రమేశ్ తాజాగా మాట్లాడుతూ.. జీలకర్రలో కర్ర లేనట్లుగా పిచ్చి ప్రేలాపనులు పవన్ చేస్తున్నారన్నారు. ఆయన పేరులో కళ్యాణ్ ఉంటే నిత్య పెళ్లి కొడుకని ఎద్దేవా చేశారు. మరింత ఎటకారం చేసే పెద్ద మనిషి.. 2014లో తమ అధినేత బాబు ఒప్పందం చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడికి పోయాయి? చట్టబద్ధంగా ఒక వ్యక్తి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తప్పు లేదు. చట్టవిరుద్ధమైన పని ఏదో చేసినట్లుగా పెళ్లిళ్ల మీద కామెంట్లు చేస్తున్న సీఎం రమేశ్ లాంటి వారి వ్యాఖ్యల్ని బాబు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. లేని పక్షంలో పవన్ కంటే కూడా పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.