బీజేపీలో చేరికపై స్పందించిన సీఎం రమేష్

Update: 2019-06-15 06:01 GMT
చాలా మంది టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో టీడీపీ ఎంపీలు భేటి అయ్యారన్న వార్త రాజకీయాల్లో కలకలం రేపింది.  బీజేపీ నేత సోము వీర్రాజు కూడా దీన్ని ధ్రువీకరిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీపై ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విశ్వాసం పోయిందంటూ పేర్కొన్నారు.

ఈడీ, ఐటీ దాడులతో బీజేపీకి టార్గెట్ అయిన చంద్రబాబు అనుయాయుడు , రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. మరోవైపు ఈయన బీజేపీ పెద్దలను కలిశారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. త్వరలోనే బీజేపీలో చేరుతారని వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా సీఎం రమేశ్ స్పందించారు.

పార్టీ మార్పుపై ఎవరూ తనను సంప్రదించలేదని.. తాను కూడా ఎవరిని కలువలేదని సీఎం రమేష్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీని వీడడం ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని మీడియాతో సీఎం రమేష్ స్పష్టం చేశారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంపై కూడా సీఎం రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఇది అసత్యమని... ఆయనను తీసుకోబోమని స్పష్టం చేశారు.

ఇలా సీఎం రమేష్ బీజేపీలో చేరుతున్నారని.. మానసికంగా టీడీపీని దెబ్బకొట్టాలనుకున్న బీజేపీకి తన వాయిస్ తో సీఎం రమేష్ చెక్ పెట్టారు. మరి టీడీపీ నేతల టెన్షన్ ఇప్పుడైనా తగ్గుతుందేమో చూడాలి..


Tags:    

Similar News