సీఎం ర‌మేష్ వ‌ర్సెస్ పేర్ని నాని.. జంపింగుల‌పై సంచ‌ల‌న కామెంట్లు

Update: 2023-01-05 06:47 GMT
రాజ‌కీయాల్లో జంపింగులు మామూలే. ఎవ‌రు ఎటు వైపు వెళ్తారో.. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప లేని ప‌రిస్థితి. మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. ఎప్పుడు ఎలాంటి రాజ‌కీయ ప‌రిణా మాలైనా.. ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే.. ఇదే విష‌యం ఇప్పుడు బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య మాటల తూటాలు పేల్చింది.

ఏపీలో చాలా మంది నాయ‌కులు.. త‌మ‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని.. త‌మ పార్టీలో చేర‌బోతున్నార‌ని బీజేపీ నా యకుడు, ఎంపీ సీఎం ర‌మేష్ వ్యాఖ్యానించారు. ఏపీ రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకోబోతున్నాయ‌ని చెప్పా రు. వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. త్వ‌ర‌లోనే బీజేపీ గూటికి చేరనున్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. వీరంతా బీజేపీ టికెట్‌పైనే పోటీ చేస్తార‌ని మ‌రో కామెంట్ పేల్చారు.

అయితే.. ఎంత మంది వ‌స్తారో.. ఎన్ని సీట్లు ఖాళీ అవుతాయో.. లెక్క‌లు త‌ర్వాత చూసుకుందాం అన్నారు. ఇక‌, ఇదే కామెంట్ల‌పై వైసీపీ ఫైర్‌బ్రాండ్, కాపు నాయ‌కుడు, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యేపేర్ని నాని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. వెళ్లేవారికి ఎప్పుడూ.. డోర్లు తెరిచే ఉంటాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.  సీఎం జ‌గ‌న్ కూడా వారిని అడ్డుకోర‌ని కామెంట్ చేశారు.

'2014 ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున  గెలిచిన ముగ్గురు ఎంపీలను, 23 ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారు.  అప్పుడు జగన్ ఏం బాధ పడలేదు. భారం తగ్గిందని అనుకున్నారు. రేపు  ఎవరు వెళ్లినా.. జగన్ ఏం ఫీల్ అవ్వరు. వెళ్తే మంచిదేలే.. ఇంకా చాలామంది లీడర్లను తయారు చేయవచ్చు అని అనుకుంటారు. ఒకవేళ బీజేపీలోకి వెళ్లినా.. వారే మోసపోతారు. ఎందుకంటే.. ఇప్పుడు ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు' అని పేర్ని నాని కౌంట‌ర్ ఇచ్చారు.

నిజ‌మేంటి? స‌రే.. ఈ ఇద్ద‌రు నేత‌ల కామెంట్ల‌ను ప‌క్క‌న పెడితే.. అస‌లు వైసీపీలో ఉన్న‌వారిలో జంప్ చేయాల‌ని అనుకునేవారు ఉన్నారా? అంటే.. ఉన్నారు. ఇది నిజ‌మే. త‌మ‌కు సీట్లు ద‌క్క‌క‌పోతే.. వెళ్లిపోయే వారు 20-30 మంది ఉన్నార‌ని పార్టీకికూడా తెలుసు.

అయితే.. వీరికి ప్ర‌త్యామ్నాయం మాత్రం బీజేపీ అయితే కాద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. టీడీపీ, లేదా.. జ‌న‌సేన ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల ముందున్న ప్ర‌ధాన ప్ర‌త్యామ్నాయ పార్టీలు. సో..  సీఎం ర‌మేష్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియ‌దు కానీ, ఆయ‌న లెక్క‌మాత్రం త‌ప్ప‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News