రాజకీయాల్ని పక్కన పెడదాం. ప్రభుత్వ అధికారులు మొదలు కొని సామాన్య వ్యక్తి వరకు ఎవరినైనా సరే.. అయితే పొగడాలి లేదంటే.. మనసును సాంత్వన పరిచేలా మాట్లాడాలి. అంతే తప్పించి.. అతనిలోని లోపాల్ని ఎత్తి చూపినా.. ఇలా బాగాలేదు.. ఇలా చేయకూడదంటూ సూచనాపూర్వకంగా విమర్శలు చేసినా.. జీర్ణించుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఇక.. ప్రభుత్వాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నా.. అందరూ పొగడాలే కానీ.. వేలెత్తి చూపించటం సుతారం ఇష్టపడని పరిస్థితి.
స్థానిక సంస్థల నుంచి కేంద్ర సర్కారు వరకు ఇలాంటి పరిస్థితే ఉంది. విమర్శల్ని.. లోపాల్ని ఎత్తి చూపే తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలాంటి ధోరణికి చెక్ పెట్టేందుకు ఏమేం చేయొచ్చన్న దానిపై ఆ రంగానికి చెందిన కొందరిని ప్రత్యేకంగా నియమించుకొని మరీ.. మీడియాను కంట్రోల్ చేయటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. గత ప్రధాన మంత్రులకు భిన్నంగా మోడీ తీరు ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా దేశ ప్రధాని తన విదేశీ పర్యటనల సందర్భంగా మీడియాను తీసుకెళ్లటం ఉండేది. మోడీ ప్రధాని కుర్చీలో కూర్చున్న ఈ ఏడున్నరేళ్ల కాలంలో చేసిన విదేశీ పర్యటనల్లో పాత్రికేయుల్ని వెంట పెట్టుకెళ్లే సంప్రదాయాల్ని పక్కన పెట్టేసిన తీరును ప్రశ్నిస్తున్నది లేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. కేంద్రం నుంచి స్థానిక సంస్థల వరకు ఎవరు ఎవరిని విమర్శించకూడదన్నట్లుగా అధికారంలో ఉన్న వారు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆందోళన కలిగించేలా మారింది. ఇక.. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్ని సైతం దాదాపుగా పబ్లిక్ డొమైన్ లో పెట్టటాన్ని పక్కన పెట్టేస్తున్నారు. న్యాయస్థానాలు తప్పు పట్టినా తమ తీరును మార్చుకోవటం లేదు. ఇలాంటి వేళ.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఇందుకు భిన్నంగా స్పందించటం షాకింగ్ గా మారింది. ఇప్పటికే సొంత పార్టీ నేతల్ని పొగడ్తలకు దూరంగా ఉండాలని.. తనను.. అదే పనిగా పొగిడే వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని చెప్పటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తేలా వార్తలు.. కథనాలు ప్రచురించాలని తాను ఎన్నడూ ఆదేశించలేదని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించటం విశేషం. ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తేలా కథనాలు అక్కర్లేదని.. అలాంటివి తాము ఆశించటం లేదన్నారు. ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లు.. విమర్శలు ఉంటే ఎత్తి చూపాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్నో పథకాల్ని అమల్లోకి తెచ్చామని.. పారిశ్రామిక రంగానికి పునర్జీవం పోసినట్లు చెప్పారు. మెచ్చుకోవద్దు.. విమర్శలు చేయొద్దనే ముఖ్యమంత్రులు ఉన్న వేళ.. అందుకు భిన్నంగా మీరు విమర్శలు చేసినా ఫర్లేదన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పటం స్టాలిన్ కు మాత్రమే చెల్లుతుందేమో?