గవర్నర్ కే సీఎం షాక్

Update: 2022-02-01 07:35 GMT
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య గొడవలు కంటిన్యూ అవుతునే ఉన్నాయి. చివరకు ఈ గొడవలు సోమవారం నాడు పీక్స్ కు చేరుకున్నాయి. గవర్నర్ ట్విట్టర్ ఖాతాను మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం బ్లాక్ చేసేసింది. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా మమతా బెనర్జీయే ప్రకటించారు. తమ ప్రభుత్వంపై గవర్నర్ తన ట్విట్టర్ ఖాతా నుంచి దుష్ప్రచారం చేస్తున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని గవర్నర్ ఇప్పటికే చాలాసార్లు బెదిరించారని మమత మండిపోయింది. ఇష్టం వచ్చినట్లు ఉన్నతాధికారులను పిలిపించుకుని గవర్నర్ రివ్యూలు చేస్తున్నారని, తరచు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వటాన్ని మమత తీవ్రంగా ఆక్షేపించారు. గవర్నర్ గా  జగదీప్ దినకర్ ను కేంద్ర ప్రభుత్వం ఏరికోరి పశ్చిమ బెంగాల్ కు పంపింది.

 జగదీప్ గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాచిరంపాన పెడుతున్నారు. ముఖ్యమంత్రికి ప్యారలల్ గా పాలన చేయటానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారు. అందుకనే గతంలో మమత రాజ్ భవన్ ముందు పెద్ద ధర్నా కూడా చేశారు. సీఎం కలవాలంటే గవర్నర్ పెద్దగా అవకాశం ఇవ్వటం లేదు. ఇదే సమయంలో బీజేపీ నేతలు కలవాలంటే మాత్రం వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి.

వివిధ అంశాలపై ఉన్నతాధికారులను తన దగ్గరకు పిలిపించుకుని రివ్యూలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులను నేరుగా పిలిపించుకుని ఆదేశాలిస్తున్నారు. ఇలాంటి అనేక కారణాల వల్ల గవర్నర్-సీఎం మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. నిజానికి గవర్నర్ వ్యవస్థ అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందనే ఆరోపణలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. గవర్నర్లుగా ఉన్న వాళ్ళల్లో అత్యధికులు కేంద్రం ప్రతినిధులుగానే ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రులను పట్టించుకోరు. ఇందుకనే గొడవలవుతున్నాయి. 
Tags:    

Similar News