కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పుత్రశోకం కలిగింది. సీఎం కుమారుడు రాకేశ్(38) మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బ్రసెల్స్ లో చికిత్స పొందుతూ రాకేశ్ తుదిశ్వాస విడిచారు. రాకేశ్ మృతితో సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం సిద్ధరామయ్య - ఆయన సతీమణి బెల్జియంలోనే ఉన్నారు.
ఇటీవల విహారయాత్ర కోసం బెల్జియంకు వెళ్లిన రాకేష్ ప్యాంక్రియాసిస్ కు సంబంధించిన వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బ్రస్సెల్స్ లోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనయుడికి తీవ్ర ఆరోగ్య సమస్య ఎదురైన నేపథ్యంలో సతీసమేతంగా సిద్దరామయ్య బెల్జియం వెళ్లారు. మరోవైపు మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సహాయం తీసుకున్నారు. తద్వారా అక్కడి అధికారులతో సమన్వయం చేసుకొని అత్యున్నత వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తమ కుటుంబ వైద్యులతో కూడా బెల్జియంలో చికిత్సాను పర్యవేక్షించేలా చూశారు. అయినప్పటికీ సిద్ధరామయ్యకు పుత్రశోకం తప్పలేదు.
సిద్ధరామయ్యకు ఇద్దరు కుమారులు కాగా రాకేష్ పెద్దవాడు. ఇటీవలే ఆయన పుట్టినరోజు జరుపుకొన్నారు. అనంతరం ఆయన బెల్జియం టూర్ కు వెళ్లారు. రాకేష్ కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. ఇదిలాఉండగా సిద్ధరామయ్య చిన్న కుమారుడు యతీంద్ర ప్రస్తుతం బెల్జియంలో ఉన్నారు. రాకేష్ మరణంతో సిద్ధరామయ్య కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.