బాబా రాందేవ్ ని టార్గెట్ చేసిన సీఎం !

Update: 2020-01-07 09:19 GMT
గత కొద్దీ రోజులముందు మహారాష్ట్రలో  కొలువుదీరిన ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సంచలనాలకు కేంద్ర భిందువుగా మారుతోంది. అధికారంలోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే    మహారాష్ట్రలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గత బీజేపీ ప్రభుత్వం సమయంలో  తీసుకున్న పలు నిర్ణయాలను తాజాగా ఏర్పాటైన  మహా వికాస్ అఘాడీ  ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆరే మెట్రో షెడ్ పనుల నిలిపివేత, కొంకణ్‌ లోని నానార్ కెమికల్ ఫ్యాక్టరీ ఆందోళనకారులపై కేసుల ఎత్తివేత తదితర నిర్ణయాల తర్వాత,ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది.

తాజాగా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం .. బాబా రాందేవ్‌కి కేటాయించిన భూములపై సర్కారు గురిపెట్టినట్టు తెలుస్తోంది. తగ సీఎం  దేవేంద్ర ఫడ్నవిస్ హయాంలో బాబాకి కేటాయించిన భూములపై పునఃసమీక్షిస్తామని పరిశ్రమలు, గనుల మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు. జూలై 2019 నివేదిక ప్రకారం రాందేవ్ బాబా సారథ్యంలోని పతంజలి గ్రూప్ కంపెనీకి లాతూర్ జిల్లాలో నిరుపయోగంగా ఉన్న 400 ఎకరాల భూమిని కేటాయించారు.  అంతకంటే ముందు ఈ స్థలాన్ని  BHEL  కోసం మాజీ సీఎం, కాంగ్రెస్ నేత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రిజర్వ్ చేశారు.

అయితే ఇక్కడి ఔసా గ్రామంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందిగా మాజీ సీఎం ఫడ్నవిస్ బాబా రాందేవ్‌ని ఆహ్వానించారు. ఎంఎస్ఎంఈ కింద స్టాంప్ డ్యూటీ నుంచి 100 శాతం ఊరటనివ్వడంతో పాటు, విద్యుత్ సుంకాల నుంచి కూడా కొద్ది కాలం పాటు మినహాయింపునిచ్చారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం కేవలం ఒక్క రూపాయికే 1 యూనిట్ విద్యుత్‌, జీఎస్టీలో రీఫండ్ సదుపాయం కల్పించారు. 
Tags:    

Similar News