డిప్యూటీ సీఎంపై సీఎం భార్య రూ.100 కోట్ల పరువు నష్టం దావా... ఎందుకు? ఎక్క‌డ‌?

Update: 2022-06-23 02:30 GMT
రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న‌వారు ఆరోప‌ణ‌లుచేసుకోవ‌డం.. స‌హ‌జం. అదేవిధంగా ప్ర‌త్యారోప‌ణలు కూ డా స‌హ‌జ‌మే. అయితే.. వీటిని సీరియ‌స్‌గా తీసుకునే వారు చాలా వ‌ర‌కు త‌క్కువ‌గానే ఉంటారు. అయి తే.. అస్సాం సీఎం, బీజేపీ నేత‌.. హిమంత బిశ్వ‌శ‌ర్మ‌.. స‌తీమ‌ణి.. ఈ రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకు న్నారు. ఏకంగా.. ప్ర‌త్య‌ర్థులు చేసిన కామెంట్ల‌పై ఆమె వంద కోట్ల రూపాయ‌ల ప‌రువు న‌ష్టం దావా వేశారు.

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శ‌ర్మ‌..  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం వేశారు. దీంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు నమోదైంది.

అసోం ఆరోగ్య శాఖ మంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఉన్న సమయంలో ఆయన భార్య రినికి భుయాన్ శర్మ‌కు అసోం ప్రభుత్వం కాంట్రాక్టులు కేటాయించినట్లు కొద్ది రోజుల క్రితం మనీశ్ సిసోడియా ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మనీశ్ సిసోడియాపై రినికి భుయాన్ గువాహటి సివిల్ జడ్జ్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కొవిడ్ కేసులు పెరిగిన సమయంలో మార్కెట్‌ రేటు కంటే అధిక ధరలకు పీపీఈ కిట్లను సరఫరా చేసేందుకు అసోం ప్రభుత్వం రిన్కి భుయాన్ శర్మకు చెందిన కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చిందని మనీష్ సిసోడియా ఆరోపణలు గుప్పించారు.

రినికి భుయాన్ శర్మ ఈ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకే 1500 పీపీఈ కిట్లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు పంపిణీ చేసినట్లు మనీశ్ సిసోడియా విమర్శించారు. ఈ ఆరోపణలను ఖండించిన శ‌ర్మ‌ పరువు నష్టం దావా వేశారు. ఏకంగా.. 100 కోట్ల‌కు పైగా దావా వేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

గ‌తంలోనూ.. ఈమె ఓ కంపెనీపై ప‌రువు న‌ష్టం దావావేసి.. ఓడిపోయారు. ఇప్పుడు.. ఏకంగా.. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రిపై 100 కోట్ల‌కు దావా వేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News