వారందరికీ ఉచితంగా ఇసుక ..సీఎం జగన్ సంచలన నిర్ణయం !

Update: 2020-06-26 06:15 GMT
అధికారంలోకి వచ్చింది మొదలు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న ఏపీ సీఎం జగన్ తాజాగా మరో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇసుక దొరక్క ఇబ్బందులు పడుతున్నవారికి శుభవార్త తెలిపారు. ఇసుక పాలసీలో అవకతవకలు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశిస్తున్నారు. తాజాగా ఇసుక పాలసీలో పలు సవరణలు చేసి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగానే పేదలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది.

ఇంటి అవసరాలు, పునరావాస నిర్మాణాల కోసం పేదలకి ఉచితంగా ఇసుక సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెల్కిపింది. గత కొద్దిరోజులుగా ఇసుక విషయంలో ప్రభుత్వంపై విమర్శలు రావాడంతో ఈ మార్పులు చేసింది. అలాగే, బలహీన వర్గాలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలకు కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా పర్మిట్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించింది.

హౌసింగ్ స్కీమ్, ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ గృహ నిర్మాణాలకు కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేసే విధంగా ప్రభుత్వం పలు సవరణలను చేసింది. కాగా, వంకలు, వాగులు, యేర్లలోని ఇసుకను స్థానిక అవసరాలకు పేదలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే వెసులుబాటును కల్పించింది. దీనికోసం వారు ముందుగా సచివాలయ అధికారుల నుంచి ఉచిత సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇసుక రవాణా విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
Tags:    

Similar News