వచ్చే నెల 7,8వ తేదీల్లో సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి , కడప జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
పులివెందులలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం మంత్రి సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి పరిశీలించారు. ట్రిపుల్ ఐటీలో రూ.139 కోట్లతో నిర్మించిన ఏడు ఇంజినీరింగ్ విభాగాలను తరగతులను పరిశీలించారు. వైఎస్ఆర్ ఆడిటోరియం, వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.
సీఎం జగన్ జూలై 7, 8వ తేదీల్లో ఇడుపుల పాయలో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని మంత్రి సురేష్ తెలిపారు. సీఎం జగన్ విద్యాభివృద్ధికి పెద్ద పీట వేశారని.. రాస్ట్రంలోని ట్రిపుల్ ఐటీలకు ఆధునాతన హంగులు సమకూర్చారని తెలిపారు. గ్రామీణ ఫ్రాంత ప్రజలకు ఉన్నత సాంకేతిక విద్యను అందించేందుకు సంస్థలను పటిష్టం చేయనున్నారన్నారు.