మీడియాకు ఉత్సాహం ఉండాల్సిందే కానీ అత్యుత్సాహం అసలే మాత్రం పనికి రాదు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా.. భావోద్వేగాలకు గురై.. అవసరానికి మించి వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు. ప్రమాణాల విషయంలో రోజురోజుకీ విమర్శలు ఎదుర్కొంటున్న మీడియా.. ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదన్న విషయాన్ని ఒకరి చేత చెప్పించుకునే పరిస్థితికి రానే రాకూడదు. దురదృష్టవశాత్తు ఇప్పుడా పరిస్థితి అంతా కనిపిస్తోంది.
ప్రజల పక్షమే పాత్రియేక ధర్మంగా ఫీలైన వారితో మీడియా సంస్థలు మొదలైనా (అందరూ అని చెప్పకున్నా.. కొందరున్నారని చెప్పొచ్చు) తర్వాతి రోజుల్లో మాత్రం ఎక్కువగా వ్యాపార కోణం రాజ్యమేలుతున్న దుస్థితి. మొన్నటికి మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియా రెండు ముక్కలైపోయి.. కొందరు హిల్లరీకి కొమ్ము కాస్తే.. మరికొందరు ట్రంప్ కు దన్నుగా నిలిచారు. ఒకటి అరా మాత్రం సాపేక్షంగా వ్యవహరించారు.
విషాదకరమైన విషయం ఏమిటంటే.. పేరున్న మీడియా సంస్థలు ఒకరి పక్షాన నిలిచి.. తమ భావాల్ని.. అమెరికా ప్రజల అభిప్రాయాలుగా ప్రపంచం మీద రుద్దటం మొదలుపెట్టారు. దీంతో.. ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థల వార్తలకు అనుగుణంగానే నడిచిన ప్రపంచ మీడియా సంస్థలకు.. ప్రపంచ ప్రజలకు భారీ షాకిస్తూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
సాంకేతికంగా ఎంతో ముందుండే దేశంలో.. ప్రజాభిప్రాయాన్ని ఆ మాత్రం పసిగట్టలేకపోయారా? అమెరికన్ మీడియా మరీ అంతగా విఫలమైందా? అన్న సందేహాలు పలువురు వ్యక్తం చేశారు. కానీ.. ఇదంతా సాంకేతిక సమస్య కాదు. పాత్రికేయానికి ప్రాధమికంగా ఉండాల్సిన లక్షణాన్ని వదిలేసి.. పక్షపాతంతో.. వ్యక్తిగత ఎజెండాల్ని అమలు చేసి.. తమ అభిప్రాయాల్ని ప్రజల మీద రుద్దటంతో ప్రభావితం చేయటం ద్వారా.. తాము అనుకున్న ఫలితాన్ని వచ్చేలా చేయగలమని భావించటం.. దాన్ని అమెరికన్ ప్రజలు సమర్థంగా తిప్పి కొట్టారు. దీని నుంచి పాఠాలు నేర్చుకోని కొన్నిసంస్థు తమకున్న కోపతాపాల్ని జోక్ పేరిట ఎటకారం చేసి.. ఆపై బుక్ అయిన వైనం ఒకటి చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ కావటంతో తప్పు జరిగిందంటూ చెంపలేసుకోవాల్సి వచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. క్లింటన్ న్యూస్ నెట్ వర్క్ గా ట్రంప్ చేత విమర్శలు చేయించుకున్న‘‘సీఎన్ ఎన్’’ కు చెందిన ప్రతినిధి..ట్రంప్ విమానం కూలిపోయిందని పేర్కొంటూ జోక్ చేశారు. సీఎన్ ఎన్ కు చెందిన మాల్వేక్స్ లైవ్ షాట్ లోమాట్లాడుతూ.. ట్రంప్ వస్తున్న విమానం కూలిపోయిందని చెప్పి.. అదంతా జోక్ అనేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావటంతో సీఎన్ ఎన్ తాజాగా చెంపలేసుకొని.. సారీ చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/