మ్యాచ్ ఓడి మీడియాతో మాట్లాడుతున్నప్లేయర్ కు కోచ్ మ్యారేజ్ ప్రపోజల్

Update: 2021-07-27 23:30 GMT
టోక్యోలో సాగుతున్న ఒలింపిక్స్ లో పలు సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టు చేసుకున్న వైనం ఆసక్తికరంగానే కాదు.. అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అర్జెంటీనా ఫెన్సర్ మరియా (ఆమె పూర్తి పేరు మరియా బెలెన్ పెరెజ్ మారిస్. అవును పేరు కాస్త పెద్దదే.. అందుకే చదివేందుకు సింఫుల్ గా ఉంటుందని సింపుల్ చేశాం) మొదటి రౌండ్ లోనే ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం ఆమె మీడియాతో లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో ఆమె వెనుక ఉన్న ఆమె కోచ్ లూకాస్ సౌసెడ్.. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అన్న అక్షరాల్ని రాసిన పేపర్ ను పట్టుకొని ప్రపోజ్ చేశారు. ఇదేమీ తెలీని మరియా మాట్లాడుతుండగా.. మీడియి ప్రతినిధులు నవ్వటం.. వెనక్కి తిరిగి చూడాలని చెప్పటంతో ఆమె వెనక్కి తిరిగారు.

కోచ్ లవ్ ప్రపోజల్ కు వెంటనే ఆమె సమ్మతించి.. విస్మయానికి గురైనట్లుగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చేసి.. ఆనందంగా ముద్దు పెట్టేశారు. మరియా ఇప్పటికి మూడుసార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పదకొండేళ్ల క్రితం అంటే 2010లో పారిస్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నప్పుడు కూడా కోచ్ సాసేడో ఇలాంటి ప్రయత్నమే చేయటం.. ఆ సమయంలో మరియా మాత్రం జోక్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించటంతో అక్కడితో ప్రపోజల్ మధ్యలో ఆగింది.

తాజాగా మాత్రం ఆమె అంగీకారంతో ప్రేమ కథ పెళ్లి దిశగా అడుగులు పడినట్లైంది. అర్జెంటీనా వెళ్లాక సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటామని ఆమె చెప్పారు. నిజానికి వీరిద్దరూ కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు చెబుతారు. కోచ్ ప్రపోజల్ కు మరియా స్పందిస్తూ.. తాను నమ్మలేకపోతున్నానని.. మేం ఈ మధురమైన క్షణాల్ని అర్జెంటీనాలో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటామని చెప్పటం ద్వారా.. వెంటనే పెళ్లి అన్న విషయాన్ని చెప్పేసిందని చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags:    

Similar News