మౌన ప్రధానిగా పేరొందిన మన్మోహన్ సింగ్‌జీ హయాంలో వనరులు.. జాతి సంపద ఏ విధంగా దోపిడీకి గురైందన్న విషయాన్ని ప్రధానమంత్రి మోడీ సవివరంగా చెప్పుకొచ్చారు. విదేశీ గడ్డ మీద యూపీఏ సర్కారు హయాంలోని అవినీతిని ఆయన సవివరంగా చెప్పుకొచ్చారు. దేశం ఏ స్థాయిలో నష్టపోయింది వివరించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి భారతీయుల్ని కలిసిన సందర్భంగా యూపీఏ హయాం నాటి కుంభకోణాల భారతానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు.
బగ్గు గనుల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగిందని.. దాదాపు రూ.1.70లక్షల కోట్ల మేర జాతికి నష్టం వాటిల్లిందన్న కాగ్ మాటల్లో నిజం ఎంత ఉందన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో తప్పించి.. మిగిలిన సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడని మోడీ.. అందుకు భిన్నంగా తాజాగా బగ్గుగనుల కేటాయింపుల్లో ఎంత భారీగా అవినీతి చోటు చేసుకుందన్న విషయాన్ని వివరంగా చెప్పుకొచ్చారు.
మీరు బగ్గు గనుల గురించి వినే ఉంటారంటూ బగ్గు కుంభకోణాన్ని ప్రస్తావించిన ఆయన.. విపక్షంపై సుతిమెత్తటి విమర్శలు చేస్తూ.. దాని తీవ్రతను కళ్లకు కట్టేలా చూపించే ప్రయత్నం చేశారు. ''204 బగ్గు గనుల్ని ఇష్టారాజ్యంగా పంచేశారు. ఎవరినైనా ఎవరైనా కలవటానికి వస్తే పుస్తకమో.. పెన్నో ఎంత సులువుగా ఇస్తుంటామో.. అదే తీరులో బగ్గు గనుల్ని కట్టబెట్టేశారు. ఒక పెన్నును ఇచ్చేటప్పుడు సరైన వ్యక్తికి ఇస్తున్నామా లేమా? అని చూసుకొని ఇస్తాం. పెన్ను విషయంలోనే ఇంత ఆలోచిస్తే.. బగ్గుగనుల కేటాయింపులో మరెంత బాధ్యతగా అప్పగించాల్సి ఉంటుంది? కానీ అలాంటివేమీ చేయలేదు'' అంటూ అసలు ఉదాహరణను చెప్పుకొచ్చారు.
''బగ్గుగనుల కేటాయింపుల్లో లక్షల కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. బగ్గు గనుల కేటాయింపుపై సుప్రీంకోర్టు పరిమితి విధించిందని.. అందులో ప్రధానమంత్రిని సైతం పేర్కొన్నారు. కానీ.. నేను ఆ వివరాల జోలికి వెళ్లదలుచుకోలేదు. 204 గనుల్లో 20 గనులను వేలం వస్తే రూ.2లక్షల కోట్లు వచ్చాఆయి. పది శాతం గనుల్ని వేలం వేస్తే.. గతంలో గనుల కుంభకోణంలో కాగ్ తేల్చిన మొత్తం రూ.1.78లక్షల కోట్ల కంటే ఎక్కువ వచ్చింది. కానీ.. ఇప్పుడు కేవలం పదిశాతం బగ్గు బ్లాకులతో వచ్చిన మొత్తం ఎంతో చూశారుగా'' అంటూ ఏ రేంజ్‌లో యూపీఏ సర్కారు హయ.
ూంలో నిధులు పక్కదారి పట్టాయన్న విసయాన్ని ఒక్క ఉదాహరణ ద్వారా మొత్తం తీవ్రతను మోడీ చెప్పారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి దేశ రాజకీయాన్ని.. కాంగ్రెస్ పాలనలో దేశంలో వనరుల్ని అయిన వారికి ఏ విధంగా దోచి పెట్టారన్న విషయాన్ని మోడీ తాజా వ్యాఖ్య అంతర్జాతీయం చేశారన్న వాదన వినిపిస్తోంది.