ఒక మేక వల్ల 2.7 కోట్లు నష్టపోయిన కోల్ ఇండియా

Update: 2019-10-03 07:25 GMT
ప్రమాదానికి గురై ఒక మేక మరణించడంతో కోల్ ఇండియా 2.7 కోట్ల రూపాయలను నష్టపోయింది. కోల్ ఇండియాకు చెందిన మహానంది బొగ్గు క్షేత్రంలో(ఎంసిఎల్) నిషేదించిన మైనింగ్ జోన్ లో జరిగిన ప్రమాదంలో ఒక మేక చనిపోయింది. దీంతో ఆ మేక యజమాని అక్కడి స్థానికులతో కలిసి వచ్చి బొగ్గు క్షేత్రం బయట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలతో దాదాపుగా మూడు గంటలు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో కోల్ ఇండియా సంస్థ దాదాపుగా 26.8 డాలర్లు అంటే మన ఇండియా కరెన్సీలో 2.7 కోట్లు కోల్పోయింది.

పోలీసులు వచ్చి ఈ గొడవలో జోక్యం చేసుకున్నాక కానీ మళ్ళీ పనులు తిరిగి మొదలు కాలేదని ఎంసిఎల్ ప్రతినిధి మెహ్రా అంటున్నారు. తమ తప్పు లేకుండానే 2.7 కోట్లు సంస్థ నష్టపోవాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. తమ సంస్థ నష్టానికి కారణమైన వారిపై లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఇక్కడి స్థానికంగా ఉండే ప్రజలు కట్టెల కోసం, పశువులను మేపడానికి అక్రమంగా బొగ్గు క్షేత్రంలోకి ప్రవేశిస్తారని అందుకే ఇలా జరిగిందని అన్నారు.


Tags:    

Similar News