పండగ సందర్భంగా సంప్రదాయంగా జరుపుకునే కోడి పందాల వ్యవహారం శృతి మించింది. కోడి పందాల వ్యవహారం హద్దులు దాటి ఇరు వర్గాల మధ్య గొడవగా మారటం.. ఇది తీవ్రస్థాయికి చేరి పెద్ద గొడవగా మారింది. కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న తాజా పరిణామం రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఇష్యూలో దాదాపు 12 మందికి తీవ్రగాయాలు అయినట్లుగా తెలుస్తోంది.
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరంలో నిర్వహించిన కోడి పందాల వ్యవహారంలో చోటు చేసుకున్న ఒక ఘటన ఈ మొత్తం గొడవకు కారణంగా చెబుతున్నారు. కోడి పందంలో రేగిన చిన్న వివాదం.. రెండు వర్గాలుగా విడిపోయి.. విచక్షణారహితంగా కొట్టుకునే వరకు వెళ్లింది. పరస్పరం చేసుకున్న దాడులతో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయి పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. ఇంత పెద్ద గొడవ జరిగేందుకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సరదాగా జరుపుకునే కోడి పందాల్ని.. మరీ అంత పర్సనల్ గా తీసుకొని.. కొట్టేసుకునే వరకు వెళ్లటం ఏమిటి?