వీళ్లు మాత్రం మారారు స్వామి!

Update: 2020-04-08 07:10 GMT
కరోనా వైరస్ .. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంజా విసురుతోంది. మంగళవారం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా - బుధవారం మళ్లీ పెరిగాయి. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి.. బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదైన కరోనా పరీక్షల్లో - మరో 15 నమోదయ్యాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో 6 - కృష్ణా జిల్లాలో 6 - చిత్తూరులో 3 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు పెరిగింది.

ఇకపోతే , ఈ కరోనా వైరస్ కి సరైన వ్యాక్సిన్ లేక పోవడంతో - ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ను విధించింది. అందులో భారత్ కూడా ఒకటి. సామజిక దూరం పాటిస్తే .. కరోనాను అరికట్టవచ్చు అనే కారణంతో కేవలం నిత్యావసర సరుకులు తీసుకోవడానికి మాత్రమే అనుమతించారు. మిలిగినవి అన్ని కూడా మూసేసారు. అయితే , ఈ లాక్ డౌన్ నియమాలని కొంతమంది లెక్కపెట్టడంలేదు. కరోనాను సీరియస్ గా తీసుకోవడం లేదు. లాక్ డౌన్ ను పాటించని దేశాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందొ చూస్తూనే ఉన్నాం.

కానీ , కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి  ప్రభుత్వం లాక్‌ డౌన్ ప్రకటించినా అక్కడక్కడా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు గుంపులుగా చేరవద్దని ప్రభుత్వం - పోలీసులు ఎంతగా  చెబుతున్నా  కూడా వినడంలేదు. తాజాగా  ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరులో ఏకంగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. దీనితో ఈ  సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేల స్థావరంపై దాడి చేసి.. 20 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రూ.57,680 నగదు - 67 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  వీళ్లు ప్రాణాలు పోతాయి అని చెప్తున్నా కూడా వినడంలేదు ..ఇంకెప్పుడు మారతారో మరి.
Tags:    

Similar News