తొల‌గించట్లే...ఉద్యోగాలిస్తాం అంటున్న కాగ్నిజెంట్‌

Update: 2017-05-25 13:44 GMT
అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్‌ లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వ‌స్త‌న్న వార్త‌ల‌కు తెర‌ప‌డింది. లే ఆఫ్ పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌డం, అందులో కాగ్నిజెంట్ పేరు ప్ర‌ముఖంగా వినిపించ‌డం అంతా చెడు ప్ర‌చారంలో భాగ‌మేన‌ని కాగ్నిజెంట్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ మెహతా తేల్చిచెప్పారు. కాగ్నిజెంట్ ఎలాంటి లేఆఫ్స్  ప్రక్రియను చేపట్టలేదంటూ ఉద్యోగులకు రాసిన‌ లేఖలో స్ప‌ష్టం చేశారు. పైగా త్వ‌ర‌లో కొన్ని కొత్త ఉద్యోగాల‌ను తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు.

అమెరికా దెబ్బతో భారత్‌ లో ఉద్యోగాల‌ను తగ్గించాలని భావిస్తోందని, పనితీరు సరిగా లేదనే పేరుతో 25,000-30,000 మందిని ఇంటికి పంపించేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసినట్టు ఇటీవ‌ల పెద్ద ఎత్తున వార్త‌లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హైదరాబాద్‌ కేంద్రం నుంచి 4,000 మంది ఉంటారని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో హైద‌రాబాద్ స‌హా చెన్నై త‌దిత‌ర చోట్ల కార్మిక శాఖ అధికారుల‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మెహ‌తా ఉద్యోగుల‌కు లేఖ రాశారు. ప‌నితీరు మ‌ధింపు, ప‌రిశ్ర‌మ ఉత్త‌మ ప‌ద్ద‌తుల‌ను అనుస‌రించేందుకు ప్ర‌తి ఏడాది చేప‌ట్టే స‌మీక్ష‌నే ఈ ఏడాది సైతం చేసిట‌న్లు వివ‌రించారు. భ‌విష్య‌త్ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఈ చ‌ర్య చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. దీన్ని లే ఆఫ్ అని పేర్కొవ‌ద్ద‌ని వివ‌రించారు.

కాగా త్వ‌ర‌లో రిక్రూట్‌ మెంట్ల‌ను పెంచ‌నున్న‌ట్లు ఈ లేఖ‌లో కాగ్నిజెంట్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ మెహతా వివ‌రించారు. ఒక్క అమెరికాలోనే కాద‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని మార్కెట్ల‌లోనూ ఇలా చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించారు.ఉద్యోగులు త‌మ నైపుణ్యాల‌ను పెంచుకోవాల‌ని సూచించిన మెహ‌తా..నూత‌న నైపుణ్యాల‌యిన డేటా సైన్సు, బిగ్ డేటా, మిషన్ లెర్నింగ్, అడోబ్ స్టాక్ వంటి వాటిలో  రీస్కిలింగ్ ప్రొగ్రామ్స్ పై ప‌ట్టు సాధించి త‌మ కొలువులు నిలుపుకోవాల‌ని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News