స్వదేశీ ఉద్యోగమంత్రం జపిస్తూ హెచ్1బీ వీసాలను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు భారతీయ టెకీలకు దడపుట్టిస్తోంది. ఇప్పటికే దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వేలాది మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇన్ఫోసిస్ తరహాలోనే కాగ్నిజెంట్ అడుగులు వేయనుంది. ఈ మేరకు హెచ్1బీ ఉద్యోగులను తగ్గించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
ప్రస్తుత క్వార్టర్ లో కాగ్నిజెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ భారీ స్థాయిలో లాభాలను చవిచూసింది. ఆ సంస్థకు ఒక్క అమెరికా నుంచే దాదాపు 75 శాతం ప్రాఫిట్స్ వస్తున్నాయి. కాగ్నిజెంట్ కంపెనీలో సుమారు రెండున్నర లక్షల మంది భారతీయులు ఉద్యోగం చేస్తున్నారు. నైపుణ్యం ఉన్న స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్ పిలుపు ఇవ్వడంతో ఇప్పుడు కాగ్నిజెంట్ స్థానికులనే ఎంపిక చేసేందుకు సిద్ధమైంది. అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించి, హెచ్1బీ వీసాలను తగ్గించాలని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజీవ్ మెహతా తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే , ఈసారి సగం మందికే వీసా దరఖాస్తు చేసినట్లు మెహతా చెప్పారు. ట్రంప్ వీసా విధానాల వల్ల భారత టెకీలకు మరిన్ని సమస్యలు తప్పేటట్టు లేదు. డిజిటల్ టెక్నాలజీలో అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ సంస్థ అత్యంత పెద్దది.
మరోవైపు ట్రంప్ ప్రభుత్వం పదవిలోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఉద్యోగాల నియామకం పెరుగుతోందని ఆ దేశానికి చెందిన లేబర్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో అమెరికా కంపెనీలు 2,11,000 ఉద్యోగాలను పెంచుకున్నాయి. ఈ ఏడాదిలో మొదటి మూడు నెలల కాలంలో నమోదైన ఆర్థిక వ్యవస్థ పతనం తాత్కాలికమేనని ఈ డేటా సూచిస్తోంది. అదేవిధంగా నిరుద్యోగిత రేటు కూడా 4.4 శాతానికి పడిపోయింది. దశాబ్దకాలంలో ఇదే అత్యంత కనిష్టమని లేబర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/