వరంగల్ ఉప ఎన్నికకు పార్టీలన్నీ సమాయుత్తమై.. ఎవరికి వారు వ్యహాలకు పదును పెడుతున్న పరిస్థితి. విపక్షాలతో పోలిస్తే.. అధికారపక్షం నేతలు దూకుడుగా వ్యవహరిస్తూ.. విజయం మీద అంతులేని ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గెలుపు తమకు పెద్ద విషయం కాదని.. మెజార్టీ మాత్రమే ముఖ్యమని చెబుతున్న పరిస్థితి. ఉప ఎన్నికల బరిలో విపక్షాలు ఎవరిని అభ్యర్థిగా నిలిపినా.. అంతిమంగా విజయం తమదేనని..అది ఖరారైందన్న భరోసా వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఓపక్క రైతుల ఆత్మహత్యలు.. వివిద అంశాల మీద కేసీఆర్ సర్కారు మీద విపరీతంగా విమర్శలు వినిపిస్తున్నా అవేమీ ఎన్నికల వేళ ప్రభావం చూపించవన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేయటం చూస్తున్న విపక్షాలు గులాబీ దళం ఆత్మవిశ్వాసానికి అబ్బురపడుతున్న పరిస్థితి. వారి కాన్ఫిడెన్స్ ను ఓవర్ కాన్ఫిడెన్స్ గా చూపించాలన్న తపన కొందరు విపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అదెంత తేలిక కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఉఫ ఎన్నిక మీద అధికారపక్షం జోరు ఈ రేంజ్ లో సాగుతుంటే.. మరోవైపు వరంగల్ జిల్లా గులాబీ తమ్ముళ్ల మధ్య లొల్లి రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య.. ఆయన్ను పదవి నుంచి తప్పించి ఆ స్థానాన్ని చేజిక్కించుకున్న కడియం వర్గీయుల మధ్య లొల్లి రోజురోజుకీ ముదిరి పాకాన పడుతోంది.
తాజాగా స్టేసన్ ఘన్ పూర్ నిర్వహించిన పార్టీ సమావేశాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య... కడియం వర్గీయుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తమ నేత పదవి పోవటానికి కారణం.. కడియమేనని రాజయ్య వర్గీయులు ఆరోపించటం.. దీనికి ప్రతిగా కడియం వర్గీయులు అడ్డుకోవటం లొల్లిగా మారింది. దీంతో.. ఇరు వర్గాలు మాటా.. మాటా అనుకునే పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటివి తనకు మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందన్న విసయాన్ని గుర్తించిన రాజయ్య కలుగజేసుకొని తన వర్గాన్ని శాంతింపజేశారు.
ఉప ఎన్నిక వేళ.. ఎంత విజయం పక్కా అనుకున్నా మధ్యలో ఈ లొల్లేందన్నది గులాబీ బ్యాచ్ కి ఆవేదనగా మారింది. అభిప్రాయ బేధాలన్నవి మిగిలిన రోజుల్లో చూసుకోవచ్చని.. ఎన్నికల వేళ పార్టీని గెలిపించుకు ఉన్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి.. ఈ గొడవలేందని పార్టీ నేతలు.. కార్యకర్తలు ఫీలవుతున్న పరిస్థితి.