పనులు మానేసి..టీడీపీ ఎంపీ-ఎమ్మెల్యే ఫైట్!
నిజమేనట! ఓట్లేసి గెలిపించిన ప్రజలకన్నా తమకు మాత్రం నిత్యం ఒకరిపై ఒకరు ఫైట్ చేసుకోవడం, కామెంట్లతో కుమ్మేసుకోవడమే ఇష్టంగా ఉందని చెబుతున్నారు ఏపీ అధికార టీడీపీ ఎంపీ - మాజీమంత్రికి. వీరిద్దరూ ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు ఫైట్ చేసేసుకుంటున్నారు. అదిచాలదని ఇంట్లోనే కూర్చుని సోషల్ మీడియాలోనూ మాటలతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. దీంతో ప్రజలు మాత్రం అలో లక్ష్మణా అంటూ తమ పనులు జరగడం లేదని లబోదిబో మంటున్నారు. విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాల్లో మూడు ప్లేస్ లో ఉన్న అనంతపురం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ - ఎమ్మెల్యేలు బరితెగించి పోరుకు దిగుతున్నారట.
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప - పుట్టపర్తి ఎమ్మెల్యే - మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు పరస్పరం ట్రంప్ - కిమ్ మాదిరిగా మాటలతో కొట్టేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే.. పదవులే!! ప్రజలు ఒక పక్క నీళ్లందక నానా తిప్పలు పడుతుంటే, వీరు మాత్రం పదవుల కోసం పోటీ పడుతూ.. పానీ విషయాలను పక్కకు పెట్టారు. విషయంలోకి వెళ్తే .. పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న గంగన్న పదవీకాలం పూర్తయినా కుర్చీని పట్టుకుని వేలాడుతున్నారు. అయితే, దీనిని తన మనిషికి ఇప్పించుకోవాలని భావించిన మాజీ మంత్రి పల్లె..గంగన్న విషయాన్ని చంద్రబాబు దృష్టి కి తీసుకెళ్లి.. సస్పెండ్ చేయించారు. అనంతరం తన మనిషిని చైర్మన్‌గా చేశారు.
అయితే, గంగన్న ఈ విషయాన్ని ఎంపీ నిమ్మల కిష్టప్ప దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన కిష్టప్ప.. తన అనుచరులను ఉసిగొలిపారు. దీంతో వారు పల్లె బీసీల పట్ల వివక్ష చూపుతున్నారని, కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే లబ్ది చేకూరుస్తున్నారని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. అయితే, ఇటీవల కాలంలో తన కుమారుడు అంబరీష్‌ను పాలిటిక్స్‌లోకి తేవాలని భావిస్తున్న కిష్టప్ప.. పల్లె నియోజకవర్గంపై కన్నేశారు. ఇదే విషయాన్ని పల్లె అనుచరులు ఇప్పుడు లేవనెత్తుతున్నారు. కిష్టప్ప వచ్చే ఎన్నికల్లో పుటపర్తి నుంచి తన కుమారుడు అంబరీష్ ను దించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అదే సోషల్ వేదిక మీద ఎదురు దాడికి దిగారు. ఈ పరిణామంతో ప్రజలు నివ్వెర పోతున్నారు. టీడీపీ నేతలకు పదవులపై ఉన్న వ్యామోహం, ప్రేమ ప్రజలపై ఉండదా అని నిలదీసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.