కమెడియన్ అలీకి జగన్ పిలుపు? ఏ పదవిస్తారు?

Update: 2021-03-03 15:02 GMT
 టాలీవుడ్  కమెడియన్ అలీ కూడా గత అసెంబ్లీ  ఎన్నికలవేళ  జగన్ కు జైకొట్టారు. జగన్ ను కలిసి వైసీపీలో చేరారు. అలీకి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ సీటును ఇద్దామని అనుకున్నా చివరి నిమిషంలో సాధ్యపడలేదు. కానీ జగన్ కోసం.. పార్టీ కోసం అలీ వైసీపీ తరుఫున ప్రచారం చేశారు. నిస్వార్థంగా పోరాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అలీ టీవీ షోలు, సినిమాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

అటు సీఎం జగన్ సైతం అధికారం చేపట్టిన తర్వాత జెట్ స్పీడుగా పాలిస్తున్నారు. నవరత్నాలు, ప్రజా సంక్షేమ పాలనతో నిత్యం తీరికలేకుండా ఉన్నారు. ప్రజల కోసం 24 గంటలు కష్టపడుతున్నారు. ప్రజాసమస్యలు, అభివృద్ధి, సంక్షేమం అజెండాగా ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలిచిన సీఎం అయిన తర్వాత జగన్ తీరికలేని బిజీ షెడ్యూల్ తో రాష్ట్ర పాలనలో తలమునకలై ఉన్నారు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కలవలేనంత బిజీ షెడ్యూల్ తో పనిచేస్తున్నారు. అవసరం అయితే తప్ప కలవడం లేదు.

ఇక అలీ కూడా ఎన్నికల తర్వాత టీవీ షోలు, సినిమాల్లో బీజీ అయ్యారు. ఈ ఇద్దరు కలుస్తారని అభిమానులు ఆశించినా అది సాధ్యపడడం లేదు.   త్వరలోనే జగన్ ను కలిసి ఆయనను అభినందిస్తానని.. మంచి పరిపాలన అందిస్తున్నందుకు ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలుపుతానని అలీ గతంలో అన్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసి పాత విభేదాలన్నీ పక్కనపెట్టి మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నారు.  

తాజాగా అలీ మళ్లీ తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ఇటీవల ప్రకటించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఇద్దరు మైనార్టీలకు అవకాశం కల్పించిన జగన్ .. అలీని మాత్రం తీసుకోలేదు. సినీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదు.

అయితే సీఎం జగన్ తరుఫున సజ్జలతో అలీ భేటి అయినట్లు సమాచారం. అలీకి మైనార్టీ కార్పొరేషన్ లేదా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.కాగా సీఎం జగన్ గత ఎన్నికల వేళ అలీకి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ పదవులు ఇస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు అలీ కలిశాక అది కూడా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News