ఏపీ సీఎం జగన్ తనకు గొప్ప బహుమతి ఇచ్చారని ప్రముఖ నటుడు, కమెడియన్ మహమ్మద్ అలీ పేర్కొన్నారు. తాజాగా ఆయనను ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ సీఎం జగన్ సర్కారు నిర్ణయం తీసుకుని జీవో కూడా జారీ చేసింది. ఈ విషయాన్ని ఆయనకు అధికారికంగా పంపించారు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్న అలీ.. సీఎం జగన్‌పై అభినందనల వర్షం కురిపించారు.
పార్టీలో తాను పడిన శ్రమకు గుర్తింపు లభించిందన్నారు. ఇప్పటి వరకు పార్టీలో ఏ పదవినీ ఆశించకుండా పనిచేశానని కొన్నాళ్ల కిందట సీఎం జగన్ ఏది తనకు చెప్పారో అదే చేశారని అలీ అన్నారు.
ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా తనను నియమించడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని అలీ వ్యాఖ్యానించారు. ఇది తన కుమార్తె పెళ్లి సందర్భంగా సీఎం జగన్ ఇచ్చిన గొప్ప కానుక భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
మనస్పూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. తనకు లభించిన ఈ పదవిలో సంపూర్ణ న్యాయం చేసేందుకు తాను చిత్తశుద్దితో పనిచేస్తానని అలీ పేర్కొన్నారు. ఇక, ఆయన సతీమణి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తమకు వివిధ వర్గాల నుంచి ఫోన్లు వచ్చాయని.. పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నా పదవి రాలేదనే చింత ఉండేదని చెప్పారు.
దీంతో ఎవరు అడిగినా ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయన్నారు. కానీ.. ఇప్పుడు సీఎం జగన్ ఇచ్చిన పదవితో తమ చింత తీరిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సోదరుడికి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమెతెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.
అయితే.. అలీ అభిమానులు మాత్రం ఆయన సర్దుకు పోయి ఉంటాడని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి అలీ చేసిన కష్టానికి ఇది పెద్ద గుర్తింపు కాదని నిట్టూరుస్తున్నారు. ఆయనకు ఇంకేదైనా ఎమ్మెల్సీనో రాజ్యసభో లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించి ఉంటే బాగుండేదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.