మంత్రి పదవి హామీ ఇస్తేనే.. ఏ పార్టీలోకి అయినా

Update: 2019-01-07 07:58 GMT
తెలుగు ఇండస్ట్రీ స్టార్ కమెడీయన్‌ అలీ. సినిమాల్లో కామెడీ ద్వారా కాకుండా.. రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష, విపక్ష నేతల్ని కలుస్తూ ఒక్కసారిగా వైరల్‌ గా మారారు అలీ. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న అలీ.. త్వరలో వైసీపీలో చేరతారని అందరూ భావించారు. దీనికి కారణం.. రీసెంట్‌ గా అలీ జగన్‌ ని కలవడమే. ఆ తర్వాత చంద్రబాబు, పవన్‌ ని కూడా కలిశారు. దీంతో.. అసలు అలీ ఏ పార్టీలో చేరుతున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. దీనిపై అలీనే ఓ చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

“1994లోనే నేను టీడీపీలో చేరాను. అప్పటి నుంచి కార్యకర్తగానే ఉన్నా. నేను పుట్టింది రాజమండ్రి అయినా నాకు గుంటూరు 1 లేదా 2 నుంచి పోటీ చేయాలని ఉంది. ఎందుకంటే.. అక్కడ నా వర్గం వాళ్లు ఎక్కువుగా ఉన్నారు కాబట్టి.. గెలవడం ఈజీ అవుతుందని. ఇక నాకు గతంలోనే టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే.. సత్తెనపల్లి సీటు ఇస్తానని చెప్పారు. కానీ నేను గుంటూరు 1 అడిగాను. అది అప్పటికే కమిట్‌ మెంట్‌ అయిపోయింది కాబట్టి ఇవ్వడం కష్టం అని చెప్పారు చంద్రబాబు. దీంతో నేను పోటీ చేయనని చెప్పేశాను. దాదాపు 20 ఏళ్లనుంచి టీడీపీలో ఉన్నా. ఇప్పుడు కూడా ఇంకా కార్యకర్తగానే ఉండాలంటే కష్టం. నా దేశం కోసం ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి. అలా చెయ్యాలంటే పదవి ఉండాలి. ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తానంటేనే ఎమ్మెల్యే గా పోటీ చేస్తా. ఒక వేళ ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినా సరే నాకేం అభ్యంతరం లేదు. అది మాట నోటిమాటతో చెప్తే కాదు..లిఖిత పూర్వకంగా రాసి ఇస్తేనే. అలా ఎవరు ఇస్తారో వాళ్ల పార్టీలోనే చేరతా” అని క్రిస్టల్‌ క్లియర్‌ గా చెప్పారు అలీ.

సో.. రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన అలీ.. మంత్రి పదవి ఎవరు ఇస్తానంటే వారి జెండానే పట్టుకుంటానని చెప్పేశారు. మరి అలీకి ముందుగా ఈ ఆఫర్‌ టీడీపీ, వైసీపీ, జనసేనల్లో ఎవరి నుంచి వస్తుందో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్‌ చెయ్యక తప్పదు.




Full View
Tags:    

Similar News