వాణిజ్య యుద్ధం అంటే ఇలానే ఉంటుంది!

Update: 2022-03-08 07:29 GMT
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్నయుద్ధం కారణంగా ప్రపంచం అప్రమత్తమైంది. ఉక్రెయిన్ యూరోపియిన్ యూనియన్ పక్షాన ఉండడంతో రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అత్యవసర సమయాల్లో పశ్చిమ దేశాలు తమను ఆదుకోవడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యూరోపియన్ దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా రష్యాను మాత్రం కట్టడి చేస్తున్నాయి. ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా విషయాల్లో రష్యాను కంట్రోల్ చేస్తున్న ఈయూ దేశాలు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

రష్యాకు సంబంధించిన  ప్రతీ విషయంలో నిషేధాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి పశ్చిమ దేశాలు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి కొన్ని దేశాలు రష్యాపై వాణిజ్య యుద్ధం చేస్తున్నాయి. రష్యాకు చెందిన విమానాల రాకపోకలను మూసివేశాయి. అటు మాస్టర్, వీసా కార్డులు రష్యాలో పనిచేయకుండా చేశాయి.

మరోవైపు పేపాల్ సంస్థ కూడా తాత్కాలకంగా తన సేవలను రష్యాలో హోల్డింగ్లో పెట్టినట్లు ఇంటర్నేషనల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ కోసం నేరుగా రష్యాపై యుద్ధం చేయకున్నా ఆర్థికంగా కట్టడి చేయడం ద్వారా ఉక్రెయిన్ కు న్యాయం చేస్తున్నట్లు ఆ దేశాలు ప్రకటిస్తున్నారు.

తాజాగా ఐబీఎం కంపెనీలు కూడా రష్యాతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించాయి. టెక్ దిగ్గజం ఐబీఎం చేసీన ఈ ప్రకటన సంచలనంగా మారింది. రష్యాలోని తమ సర్వీసులన్నింటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ తెలిపారు. రష్యాకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని తమను అడుగుతున్నారని, దానికి ఇదే మా సమాధానమని తెలిపారు.

మరికొన్ని వాణిజ్య సంస్థలు సైతం రష్యాకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ సంస్థల్లో ఒకటైన  డెలాయిట్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. రష్యాతో పాటు బెలారస్లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపేంత వరకు తమ సేవలు కొనసాగవని, మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత సేవలు ఉంటాయని తెలిపింది. అలాగే ఎర్నెస్ట్ అండ్ యంగెస్ట్, ప్రైజ్ వాటర్ కూపర్స్ సంస్థలు ఇదే ధోరణిలో ఉన్నాయి.

వీటికి తోడు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిన్సాన్ రష్యాకు వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. రష్యాకు ఎగుమతి చేయాల్సిన కార్లను ఆపేసింది. రష్యన్ సినిమా ప్రొడక్షన్ హౌసెస్తో కుదుర్చుకున్న కాంట్రాక్టులను నెట్ ప్లెక్స్ ఆపేసింది. నాలుగు రష్యాన్ ప్రాజెక్టులను నిలిపివేసింది. డెడ్ లైన్ వెరైటీ సిరీసులను తాత్కాలికంగా స్వస్తి పలికింది. మైక్రోసాఫ్ట్, టిక్ టాక్, శామ్ సంగ్, ఎయిర్ బీఎన్బీ, గూగుల్ వోక్స్ వాగన్ లాంటి సంస్థలు తమ సర్వీసులను ఇప్పటికే నిలిపివేశాయి.
Tags:    

Similar News