నేటి కష్టాలే రేపటి లాభాలు

Update: 2016-11-15 11:30 GMT
భారతదేశాన్ని నడిరోడ్డుపై నిలబెట్టిన మోడీ నిర్ణయం భవిష్యత్తులో అద్భు త ఫలితాలు ఇవ్వడం ఖాయమంటున్నారు పలువురు ఆర్తిరకంగ నిపుణులు. ఇప్పుడు ఏటీఎంలు - బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్న సామాన్యులే రేపు మోడీని శభాష్ అనక మానరని చెబుతున్నారు. ఇప్పుడు కష్టపడుతున్నవారంతా రేపు సుఖపడతారని చెబుతున్నారు.

దేశంలో అధిక శాతం మంది చిరుద్యోగులే. తక్కువ వేతనాలకు రేయింబవళ్లు కష్టపడి పనిచేసేవారే. వారంతా పైసాపైసా కూడబెట్టి ఇల్లు కొనాలని.. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని.. అమ్మాయిలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలని కలలు కంటుంటారు. కానీ... నెల జీతం పదో తేదీ తరువాత కనిపిస్తే ఒట్టు. వీధిలో దుకాణాల్లో అరువులు... అక్కడాఇక్కడా చేబదుళ్లు... ఇంకా అవసరమైతే పర్సనల్ లోన్.. ఆపద్బాంధవి లాంటి క్రెడిట్ కార్డు.. చాలీచాలని జీతాలతో బతుకీడ్చేవారే అధికం. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లోనో.. హోం లోనో ఏదో ఒక భారం నెత్తిన ఉంటుంది. మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో వారందరికీ మేలు జరుగుతుందని చెబుతున్నారు. బ్యాంకుల్లో నగదు జమ పెరగడంతో వడ్డీ రేట్లు తగ్గడం గ్యారంటీ అని... ఫలితంగా ఈఎంఐలు తగ్గి సామాన్యులకు వెసులుబాటు కలుగుతుందని విశ్లేషిస్తున్నారు.

- నోట్ల రద్దు కారణంగా అందరి చేతుల్లో ధనం తగ్గిపోయింది. ఫలితంగా కరెన్సీ ఫ్లో ఒక్కసారిగా పడిపోయింది. ఇది అత్యంత కీలక పరిణామం. చేతిలో డబ్బు లేకపోవడం వల్ల కొనుగోలు శక్తి తగ్గి ధరలు దిగివస్తాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. రానున్న ఏడాది కాలంలో రెపో రేట్లు - వడ్డీ రేట్లు తగ్గుతాయి.

- దేశంలో ఆదాయపన్ను చెల్లించేది కేవలం 3 శాతం మందే. కానీ.. తాజా పరిణామలతో అంతా బహిరంగం కావడంతో ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సో.. ప్రభుత్వానికి పన్ను రూపంలో మంచి ఆదాయం సమకూరనుంది. ప్రభుత్వ ఖజానా నిండితే ప్రజోపయోగ పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.

- ఇదేకాకుండా కేంద్ర - రాష్ట్రాలకు ప్రజలు చెల్లించాల్సిన అనేక రకాల పన్నులు కూడా వసూలవుతున్నాయి. ఏళ్ల తరబడి బకాయిలు ఉన్నవారు కూడా తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వదిలించుకోవడానికి వాటిని చెల్లించేస్తున్నారు. అంతేకాదు.. అవకాశం ఉంటే రానున్న అయిదారేళ్లకు పన్ను చెల్లిస్తామని కూడా చెబుతున్నారు.

మరోవైపు రియల్ ఎస్టేట్ దిగిరావడం ఖాయం. రియల్ ఎస్టేట్ రంగంలో సగం నల్ల ధనమే. లెక్కకు చూపకుండానే కొనుగోళ్లు - విక్రయాలు జరుగుతాయి. ఇప్పడు భారీగా పన్నులు - జరిమానాలు ఉండడంతో వ్యవహారమంతా వైట్ లోనే నడపాల్సి ఉంటుంది. సో... స్థలాలు, ఫ్లాట్ల రేట్లు తగ్గుతాయి.

ప్రస్తుతానికి పనులు మానుకుని ఎండను - చలిని లెక్కచేయకుండా కరెన్సీ కోసం కష్టాలు పడుతున్న ప్రజానీకమతా సమీప భవిష్యత్తులోనే దీని ప్రయోజనాలు అందుకుంటారని విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News