ఏపీ ప్రత్యేక హోదా అంశంపై గళం విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రానున్నరోజుల్లో తన ఆందోళనల్ని మరింత ఉధృతం చేయనున్న విషయాన్ని ఇప్పటికే చెప్పటం తెలిసిందే. ఇంతకాలం వన్ మ్యాన్ ఆర్మీగా వ్యవహరిస్తూ.. ప్రతి అంశం పైనా తానే స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా అంశంతో పాటు.. కేంద్రంలోని మోడీ సర్కారు ఉత్తరాదికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దక్షిణాదిని పట్టించుకోవటం లేదన్న వాదనను వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ విధానాలపై విమర్శలు సంధిస్తున్న పవన్ కు తోడుగా నిలిచేందుకు.. ఆయనతో కలిసి నడిచేందుకు ఏపీ కమ్యూనిస్టు నేతలు సమాయుత్తమవుతున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని ఏపీ సర్కారు గాలికి వదిలేసిందంటూ దుయ్యబట్టారు.
పెట్టుబడిదారులకు అండగా వ్యవహరిస్తున్న కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఎండగట్టిన కామ్రేడ్ రానున్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోకలిసి నడవనున్నట్లుగా చెప్పారు.ఇప్పటికే పవన్ తో చర్చలు జరిపినట్లుగా చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం చంద్రబాబుకు లేదన్న రామకృష్ణ మాటల్ని చూస్తుంటే.. కమ్యూనిస్టులు పవన్ బాట పట్టేందుకు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/