ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా ఇప్పటినుంచే అన్ని పార్టీలు ఎత్తులు - పైఎత్తులు - వ్యూహాలు - ప్రతివ్యూహలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పట్ల ప్రజలలో సానుభూతి వ్యక్తమవుతుండడంతో ఆయనతో కలిసేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీలైన సీపీఐ - సీపీఎం జగన్ తో కలవాలని భావిస్తున్నాయి. ఈ పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకులు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కలవాలని భావిస్తున్నా జాతీయ స్థాయిలో మాత్రం అంగీకారం రావడం లేదని తెలిసింది. అలాగే క్షేత్ర స్దాయిలో కూడా కార్యకర్తల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ తో కలసి బరిలోకి దిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదని క్షేత్రస్దాయిలో ప్రచారం జరుగుతోంది. జగన్ తో కలసి నడిస్తే చంద్రబాబు నాయుడిని - భారతీయ జనతా పార్టీని ఏకకాలంలో కొట్టవచ్చునని వామపక్షాలు భావిస్తున్నాయి. ఇదే విషయంపై పార్టీలో తీవ్ర స్దాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. జగన్ పై ఉన్న కేసులన్నీ ఆయనను ఇరుకున పెట్టేందుకే తప్ప కోర్టుల్లో నిలబడవని ఈ విషయం ప్రజలకు కూడా తెల్సిందని వామపక్షాలు భావిస్తున్నాయి. ఈ సమయంలో జగన్ తో కలవడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత రాదని వారు భావిస్తున్నారు.
అలాగే గతంలో తమను మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా గుణపాఠం చెప్పినట్లు ఉంటుందని వామపక్షాలు చెందిన నాయకులు భావిస్తున్నారు. " మాతో కలసి అధికారాన్ని పొందారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసారు. తిరిగి మాతో కలవాలనుకుంటున్నారు. ఇదీ అవకాశ వాద రాజకీయాలకు పరాకాష్ట. గతంలో చంద్రబాబును నమ్మి నష్టపోయాము. ఇక మీదట అలా జరగదు. ఆయనను గద్దె దించడమే కాదు భవిష్యత్తులో ఆ పార్టీ లేకుండా చేస్తాం. " అని వామపక్షాలకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. దీనిని బట్టి చంద్రబాబుపై వామపక్షాల నేతలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో తెలుస్తోంది. జగన్ తో కలవడం దాదాపు ఖాయమైనట్టుగా జాతీయ స్దాయి నాయకులు చెబుతున్నారని ఆ నాయకుడు వెల్లడించారు. స్దానిక నాయకులకు పవన్ కల్యాణ్ తో వెళ్లాలని ఆలోచన ఉన్న సినిమా వాళ్లతో వామపక్షాలకు సరిపడదని జాతీయ స్దాయి నాయకులు అంటున్నారు. ఈ పరిణామాలను చూస్తే వచ్చే ఎన్నికలలో జగన్ - వామపక్షాలు కలిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.