బ్రిటీషోడు చేయ‌ని ప‌నిని క‌మ్యునిస్ట్ చేశాడుగా!

Update: 2019-01-03 05:42 GMT
మొండోడు రాజు కంటే బ‌ల‌వంతుడు. మ‌రి.. రాజే మొండోడు అయితే?  కోట్లాది మంది వ‌ద్ద‌ని చెబుతున్నా?  త‌మ సెంటిమెంట్‌ను గౌర‌వించాల‌ని కోరుకున్నా.. ప్రాధేయ‌ప‌డ్డా క‌నిక‌రించ‌ని వైనం క‌మ్యునిస్టుల‌కు సొంతం. ఇప్పుడు అలాంటి కేర‌ళ క‌మ్యూనిస్ట్ ముఖ్య‌మంత్రి చివ‌ర‌కు తాను అనుకున్న‌ది సాధించారు.

50 ఏళ్ల లోపు ఉన్న మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌వేశంపై ఉన్న అభ్యంత‌రాన్ని సుప్రీం త‌ప్పు ప‌ట్టి తీర్పు ఇచ్చిన మూడు నెల‌ల తర్వాత ప‌ట్టుబ‌ట్టి మ‌రి.. ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని ఆల‌య ప్ర‌వేశం చేయించిన వైనం తెలిసిందే. 50 ఏళ్ల లోపు మ‌హిళ‌ల్ని శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి ప్ర‌వేశించ‌కుండా ఆంక్ష‌లు దాదాపుగా 200 ఏళ్ల‌కు పైనే ఉన్న‌ట్లు చెబుతారు.

ఈ విష‌యంలో క‌చ్ఛిత‌మైన ఆధారాలు లేకున్నా.. 19వ శ‌తాబ్దంలో బ్రిటిష్ స‌ర్వే నివేదిక ప్ర‌కారం 200 ఏళ్ల క్రితం నుంచే శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌వేశంపై ఆంక్ష‌లు ఉన్న‌ట్లుగా చెబుతారు. వీటిని బ్రేక్ చేస్తూ.. కోర్టు తీర్పు ఇచ్చినా.. అన‌ధికార ఆంక్ష‌లు కొంత‌కాలంగా సాగుతున్నాయి.

ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంత‌రం.. దాన్ని అమ‌లు చేసేందుకు కేర‌ల క‌మ్యునిస్టు ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి 50 ఏళ్ల లోపు మ‌హిళ‌ల ప్ర‌వేశం పై ఉన్న ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ ను తోసి రాజ‌నేందుకు ప‌క్కా వ్యూహాన్ని సిద్ధం చేసిన విజ‌య‌న్ ప్ర‌భుత్వం.. ఎట్ట‌కేల‌కు తాము అనుకున్న‌ది సాధించింది.

పోలీసుల సంర‌క్ష‌ణ‌లో గుట్టుచ‌ప్పుడు కాకుండా స్వామి ద‌ర్శ‌నం చేయించిన త‌ర్వాత‌.. తాము చేసిన ప‌ని గురించి మీడియాకు ఫోటోలు.. వీడియోల‌ను సైతం అందించింది. ఈ మొత్తం వ్య‌వ‌హారం చూసిన‌ప్పుడు.. కోట్లాది మంది సెంటిమెంట్ల‌ను దెబ్బ తీసేందుకు ఒక ప్ర‌జా ప్ర‌భుత్వం ఇంత క‌స‌ర‌త్తు చేయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. రాష్ట్రంలో స‌మ‌స్య‌లే లేన‌ప్పుడు ఇలాంటివి చేస్తారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌జ‌ల‌కు బోలెడ‌న్ని స‌మ‌స్య‌లున్నా.. వాటి ప‌రిష్కారం మీద మొండిగా ఉండ‌ని విజ‌య‌న్ ప్ర‌భుత్వం.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో 50 ఏళ్ల లోపున్న మ‌హిళా భ‌క్తుల ద‌ర్శ‌నం కోసం ఇంత ప్లానింగ్ చేయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇదిలా ఉంటే.. కోట్లాది మంది ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను కాద‌ని.. గుప్పెడు మంది క‌మ్యూనిస్టుల ఆనందం కోసం.. వారి ఇగోను సంతృప్తి ప‌ర్చ‌టం కోసం ఇంత మొండిత‌న‌మా? అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ్రిటీషోడు సైతం కేర‌ళీయుల సెంటిమెంట్‌ ను గౌర‌వించి.. వారి మ‌నోభావాలు దెబ్బ తిన‌కుండా ఉండేలా 200 ఏళ్ల క్రిత‌మే నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు.. క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం మాత్రం క‌నిక‌రం లేకుండా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.


Full View

Tags:    

Similar News