చంద్రబాబుపై అమిత్ షాకు కంప్లయింట్

Update: 2016-07-10 10:13 GMT
 ఏపీలో బీజేపీలో జరుగుతున్న పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్ర పట్టనివ్వడం లేదంట.  ప్రస్తుతం చంద్రబాబుకు అత్యంత అనుకూలమైన, అదే సామాజిక వర్గానికి చెందిన కంభంపాటి హరిబాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.  హరిబాబు అధ్యక్షుడిగా ఉండడంతో ఏపీ బీజేపీ ఇంచుమించుగా చంద్రబాబు కనుసన్నల్లోనే ఉన్నట్లుగా ఉంది. కానీ... ఒక వర్గం మాత్రం చంద్రబాబు అంటే తీవ్ర వ్యతిరేకత చూపుతూ వస్తోంది. దీంతో రెండు వర్గాలుగా చీలిపోయిన బీజేపీకి ఎవరిని అధ్యక్షుడిని చేయాలన్న విషయం కూడా ఇంకా తేలలేదు.  ఎలాగైనా చంద్రబాబు అనుకూలురనే మళ్లీ అధ్యక్షుడిని చేయాలని చంద్రబాబు - వెంకయ్యనాయుడులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే.. సొంతంగా ఎదగాలని.. పార్టీపై చంద్రబాబు గ్రిప్ తగ్గించాలని గట్టిగా పంతం పడుతున్న ఇతర నేతలు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం అమిత్ షాతో రాష్ట్ర నాయకులంతా సమావేశమయ్యారు. కొందరు పార్టీ నేతలు నేరుగా చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారని.. టీడీపీ నేతల్లా మారుతున్నారని చంద్రబాబు వ్యతిరేక బీజేపీ వర్గం అమిత్ షాకు కంప్లయింట్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ బీజేపీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారంటూ వారు ఆరోపించారట. దీంతో అమిత్ షా కూడా చాలా సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది.

బీజేపీ నేతల ఫిర్యాదులో అమిత్ షా పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మీదట ఏపీ బీజేపీ నేతలెవరూ నేరుగా చంద్రబాబుతో - టీడీపీ కీలక నేతలతో అధికారిక చర్చలు జరపడానికి వీల్లేదని నిర్ణయించారు. దేనిపైనైనా చర్చించాలంటే తమకు ముందుగా తెలియజేయాలని.. తాము నిర్ణయించినవ్యక్తులే మాట్లాడాలని సూచించారట.  ఎవరైనా క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారట. దీంతో ఏపీ బీజేపీ తన పట్టు నుంచి జారుతోందా అని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News