ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహానీ ఉందంటూ ఓ వ్యక్తి ఈ రోజు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం పెద్ద సంచలనమైంది. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముస్లిం జాగరణ మంచ్ రాష్ర్ట కన్వీనర్‌గా ఉన్న షేక్ మహమ్మద్ ఈ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే జనార్థన్ ముస్లిం సామాజికవర్గానికి చేస్తోన్న అన్యాయాలపై తాను పోరాటం చేస్తున్నానని..అందుకే ఎమ్మెల్యే తనపై కక్ష కట్టారని మహమ్మద్ ఆరోపించారు. ముస్లింలకు ఎమ్మెల్యే చేస్తోన్న అన్యాయాలకు వ్యతిరేకంగా తాను ఉద్యమించడంతో తనను ఎమ్మెల్యే హతమార్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని మహమ్మద్ పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ సెప్టెంబర్ 19లోగా తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ వివాదాలకు దూరంగానే ఉంటారు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనమే. జనార్థన్‌పై ఆరోపణలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.