ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్ లో.. అత్యాచారం జ‌రిగిన 27 ఏళ్ల త‌ర్వాత పోలీసుల‌కు ఫిర్యాదు..!

Update: 2021-03-08 00:30 GMT
రేప్‌ జ‌రిగిన 27 సంవ‌త్స‌రాల త‌ర్వాత నిందితుల‌పై ఫిర్యాదు చేసిందో మ‌హిళ‌. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని షాజ‌హాన్ పూర్ లో చోటు చేసుకుంది. అయితే.. ఇప్పుడు ఫిర్యాదు చేయ‌డానికి కార‌ణం కూడా వెల్ల‌డించింది స‌ద‌రు మ‌హిళ‌.

బాధితురాలికి 12 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న‌ప్పుడు ఆమె ఇంటి ప‌క్క‌న ఉండే న‌కి హ‌స‌న్ అనే వ్య‌క్తి ఇంట్లోకి జొర‌బ‌డి అత్యాచారం జ‌రిపాడ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత అత‌ని సోద‌రుడు గుడ్డు అనే వ్య‌క్తి కూడా త‌న‌పై లైంగిక దాడి చేశాడ‌ని పేర్కొంది. వీరిద్ద‌రూ క‌లిసి ప‌లు మార్లు త‌న‌పై అత్యాచారం చేశార‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ దారుణం ఫ‌లితంగా.. తాను 13 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే గ‌ర్భం దాల్చిన‌ట్టు పేర్కొంది. 1994లో ఒక బాలుడికి జ‌న్మ‌నిచ్చింది బాధితురాలు. ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత త‌న తండ్రి ఎవ‌రో చెప్పాల‌ని ప‌ట్టుబ‌ట్టాడ‌ట ఆమె కుమారుడు. ఈ కార‌ణం వ‌ల్లే పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిపింది. అయితే.. ఈ కేసు న‌మోదు చేసేందుకు మొద‌ట పోలీసులు అంగీక‌రించ‌లేదు. అయితే.. బాధితురాలు కోర్టును ఆశ్ర‌యించి మ‌రీ, కేసు న‌మోదు చేయించుకుంది.




Tags:    

Similar News