రేపటి నుంచి సంపూర్ణ లాక్​డౌన్​..! సరుకులు ఇవాళే తెచ్చుకోండి..!

Update: 2021-05-23 06:30 GMT
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్​డౌన్​ విధిస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. అయితే సంపూర్ణ లాక్​డౌన్​ విధించడం.. కఠిన ఆంక్షలు అమలు చేయడంతో ఢిల్లీలో కేసులు తగ్గాయి. దీంతో మిగిలిన రాష్ట్రాలు సైతం ఇదే పద్ధతిని అవలంభించాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. తమిళనాడులో ఇప్పటికే లాక్​డౌన్​ అమల్లో ఉంది. అయితే కొన్ని సడలింపులు విధించారు.

అయితే తమిళనాడులో కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సీఎం స్టాలిన్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు.సోమవారం నుంచి తమిళనాడు రాష్ట్రంలో సంపూర్ణ లాక్​డౌన్​ విధించబోతున్నట్టు ఆయన ప్రకటించారు. కరోనా కట్టడికి లాక్​డౌన్​ మించి వేరే మార్గం ఏదీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం నుంచి రాష్ట్రంలో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సేవలను కంప్లీట్​ గా బంద్​ చేయనున్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిసినా.. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం స్టాలిన్​ ప్రకటించారు. ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం స్టాలిన్​ ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాక్షిక  లాక్​డౌన్​తో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని ఆయన పేర్కొన్నారు. కఠిన లాక్​డౌన్​ను మే 31 వరకు అమలు చేయబోతున్నట్టు స్టాలిన్​ ప్రకటించారు.

ఆదివారం రాత్రి 9 గంటల వరకే అన్ని దుకాణాలు తెరిచిఉంటాయి. కాబట్టి.. ఏం కావాల్సిన కొనుగోలు చేయడానికి ఈ ఒక్కరోజే అనుమతి ఇచ్చారు. దీంతో ఆదివారం రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు తెలుగురాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ .. ఆంధ్రప్రదేశ్​లో మాత్రం కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.
Tags:    

Similar News