ప్రపంచంలో కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బంది పడని దేశాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దాదాపుగా చాలా దేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని అనేక ఇబ్బందులు పడ్డాయి .. పడుతున్నాయి. కరోనా మహమ్మారిని అదుపు చేయడం వీలుకాక లాక్ డౌన్ అనే అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే , లాక్ డౌన్ వల్ల ఎంతోమంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత లాక్ డౌన్ ను కొంచెం కొంచెం గా తగ్గిస్తూ వస్తున్నా కూడా కరోనా మాత్రం తగ్గినట్టే తగ్గి మరోసారి విజృంభిస్తుంది. ఈ కరోనా కోరల్లో చిక్కుకొని మరో దేశం పూర్తిగా లాక్ డౌన్ లోకి జారిపోయింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి భయానకంగా విస్తరిస్తోన్న పరిస్థితులను దృఫ్టిలో ఉంచుకుని జర్మనీలో లాక్ డౌన్ విధించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది.
రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా పూర్తిగా లాక్ డౌన్ విధించినట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. అయిదు రోజుల ఈస్టర్ హాలిడేస్ లను ప్రజల్లో ఇళ్లల్లోనే జరుపుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఆరంభమైందని తెలిపారు. జర్మనీ వ్యాప్తంగా ఏడు రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసులు 107 శాతం మేర నమోదయ్యాయి. 68 వారాల తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు రికార్డ్ కావడం ఇదే తొలిసారి. 16 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ లాక్ డౌన్ ను విధించాల్సి వచ్చిందని ఏంజెలా మెర్కెల్ తెలిపారు.
జర్మనీలో ఇప్పటిదాకా 26,78,262 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75,418 మంది మరణించారు. 24,23,400 మంది రికవరీ అయ్యారు. 1,79,444 యాక్టివ్ కేసులు జర్మనీలో కొనసాగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కేసుల పెరుగుదల అనూహ్యంగా ఉంటోందని జర్మనీ రాబర్ట కోచ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించింది. ప్రతి లక్ష మంది జనాభాకు 107 మంది వైరస్ బారిన పడుతున్నారని వెల్లడించింది. దీనితో ఏప్రిల్ 18వ తేదీ వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించినట్లు ఏంజెలా మెర్కెలో తెలిపారు. ఆ తరువాత కేసుల పెరుగుదలలో క్షీణత కనిపిస్తే.. లాక్ డౌన్ ను సడలిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి జర్మనీలో అయిదు రోజుల ఈస్టర్ హాలిడేస్ ను ప్రకటించారు. లాక్ డౌన్ ను విధించినందు వల్ల ఈస్టర్ హాలిడేస్ ను ప్రజలు ఇళ్లల్లోనే గడపాలని ఛాన్సలర్ సూచించారు.