కరోనా వైరస్ .. గత కొన్ని రోజులుగా ఏ ఇద్దరు కలిసినా మాట్లాడే మొదటి మాట కరోనా సంగతేంటి. ఈ కరోనా మహమ్మారి దెబ్బకి చిన్నా , పెద్దా , ముసలి , ముతకా , ఆడ , మగ .. ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి భారిన పడినవారు. మా దేశం ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పుకునే ఎన్నో దేశాలు సైతం కరోనా ను ఎలా అరికట్టాలో తెలియక నానా అవస్థలు పడ్డాయి , పడుతున్నాయి. అయితే , ఈ కరోనా అసలు ఎప్పుడు , ఎక్కడ పుట్టింది అనే దానిపై ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన దాని ప్రకారం 2019 నవంబర్ 17న చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్ట మొదట కరోనా సోకినట్లు గుర్తించారు. దీనితో ఈ మహమ్మారి మొదటి కేసు నమోదు అయ్యి సరిగా ఏడాది అవుతుంది.
ఇక , డిసెంబరు 15 నాటికి మొత్తం కరోనా మహమ్మారి కేసులు 27 ఉండగా డిసెంబర్20 నాటికి ఈ సంఖ్య 60 కు చేరింది. ఆ తర్వాత ఒక్కొక్క ఊరికి చేరుకుంటూ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. లాక్ డౌన్ లోకి వెళ్ళింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న దేశాలు కరోనా దెబ్బకు ఎన్నో దేశాలు చేతులెత్తేశాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి అగ్ర దేశాల్లో కరోనా మహమ్మారి జోరుకి బ్రేకులు వేయలేక , లాక్ డౌన్ పొడిగించారు తప్ప , ఏమీ చేయలేకపోయారు. ఈ మహమ్మారి కొన్ని కోట్ల మంది జీవితాలని చిన్నాభిన్నం చేసింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు దూరం చేసింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది.
ఇకపోతే , మొదట్లో చైనా లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ఆ తర్వాత ఫ్రాన్స్ , స్పెయిన్ , అమెరికా , యూకే , భారత్ లో తన ప్రభావాన్ని చూపించింది, ఇప్పటి వరకు 55 మిలియన్ల జనాభాకు కరోనా సోకగా 35.2మిలియన్ల మంది కోలుకున్నారు. 1.33 మిలియన్ల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రజల జీవన విధానంలో కరోనా సరికొత్త మార్పులు కూడా తీసుకొచ్చింది. పేస్ మాస్కులు , శానిటైజర్లు మానవ జీవితాల్లో భాగమైయ్యాయి. ఇక ఏడాది అయిపోతున్నా, ఈ మహమ్మారి నిర్ములనకి సరైన వ్యాక్సిన్ ను ఇంకా రాకపోవడం కొంచెం దురదృష్టకరం. అయితే ప్రస్తుతం కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ అంటూ బయపెడుతుండటంతో ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతున్నారు .