2000 ఏళ్ల కిందటి కంప్యూటర్ పై పరిశోధనలు.. గుట్టు వీడనుందా?

Update: 2021-03-27 17:30 GMT
సహజంగా గ్రీకు పరికరాలు తమదైన ప్రత్యేకతను కలిగి ఉంటాయి. పురాతన కాలం నుంచి గ్రీకు శాస్త్రవేత్తలు, వారు రూపొందించిన వివిధ పరికరాలు, విధానాలు ఇప్పటి శాస్త్రవేత్తలకు పెద్దగా అంతుపట్టవు. ఇక వారు 2000 ఏళ్ల క్రితం ఉపయోగించిన పరికరం పని తీరు ఇప్పటికే తెలియకపోవడం గమనార్హం. అత్యంత పురాతన కంప్యూటర్ గా భావించే ఈ పరికరాన్ని రోమన్ నాటి నౌక శిలల్లో 1901లో కనుగొన్నారు. దీని పనితీరు తెలుసుకోవడానికి అప్పటి నుంచి ప్రయోగాలు జరుగుతున్నాయి.

అధ్యయనం ముమ్మరం
ఈ పురాతన పరికరం పనితీరును తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు రీక్రియేట్ చేశారు. దీనిలోని యాంటికితేరా మెకానిజం వారికి సైతం అంతుచిక్కడం లేదు. గ్రహణాలు, విశ్వ రహస్యాలు, ఇతర ఖగోళ అంశాలను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించేవారని శాస్త్రవేత్తలు గుర్తించారు. చేతితో తిప్పే ఈ పరికరాన్ని సమూలంగా అధ్యయనం చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ పరికరంలో మూడు వంతు మాత్రమే ఉన్నాయి. మిగతా భాగం శిథిలమైంది. కాగా దీని సమూల స్వరూపం, పనితీరుపై శాస్త్రవేత్తలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

శేష భాగం రీక్రియేట్
ఈ పరికరం ముందు భాగం లేదు. కాగా వెనుక భాగంపై ఇప్పటికే పరిశోధనలు చేశారు. ఇక ముందు భాగం గేర్ల పనితీరును చాలా కాలంగా పరిశీలిస్తున్నారు. త్రీడీ కంప్యూటర్ ఉపయోగించి దీని గుట్టు విప్పడానికి సిద్ధమయ్యారు లండన్ శాస్త్రవేత్తలు. ఆధునిక పరికరాలను ఉపయోగించి ముందుభాగాన్ని రీక్రియేట్ చేసి.. పూర్తి నమూనాను సిద్ధం చేసి అనంతరం దీనిపై పరిశోధనలు చేయాలని భావిస్తున్నారు.

'తొలి నమూనా మాదే'
ఈ పరికరం గేర్లకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఓ సైంటిఫిక్ పేపర్ శుక్రవారం ప్రచురించింది. అందులో దీనిలోని అంతర భాగాలు, వాటి వివరాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన పరికరంలో సూర్యుడు, చంద్రుడు వంటి ఖగోళ అంశాలు నిక్షిప్తమై ఉన్నట్లు గుట్టు విప్పింది తామేనని ఆ పేపర్ రచయిత ప్రొ.టోని ప్రీత్ వెల్లడించారు. ఆ పరికరంలోని భౌతిక వర్ణనలు, శాసనాల ఆధారాలకు సరిపోయే నమూనాను తయారు చేసింది తామేనని అన్నారు.

తొలి అనలాగ్ కంప్యూటర్
ఈ పురాతన కంప్యూటర్ ని ఖగోళ కాలిక్యులేటర్, ప్రపంచంలోనే తొలి అనలాగ్ కంప్యూటర్ గా అభివర్ణిస్తున్నారు. ఈ పరికరాన్ని ఇత్తడితో తయారు చేశారు. ఇందులో అనేక గేర్లు ఉన్నాయి. ఆ గేర్ల సిస్టం శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉంది. దీనిలై విశ్వ వర్ణన నిక్షిప్తమై ఉంది. దీనిని తయారు చేసినప్పుడు ఉన్న అయిదు గ్రహాల కదలికల నమూనాలు ఉన్నాయి. మూడు వంతులు ఉన్న ఈ పరికరం శేష భాగాన్ని తయారు చేసి పూర్తి పరికరంగా సృష్టించనున్నారు.

దీనిపై ఇతర ప్రయోగాలు చేయడానికి లండన్ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. మరి 2000 ఏళ్ల నాటి ఈ పురాతన కంప్యూటర్ గుట్టు వీడనుందా అనేది చూడాలి.
Tags:    

Similar News