హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కామ్రేడ్లు ఎవరివైపు?
రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎంతో ఉత్కంటతో చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పోరులో పోటీ మొత్తం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లే ఉంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కావటంతో పోరు బీజేపీ చుట్టూనే సాగుతోంది. కాంగ్రెస్ బరిలో ఉన్నా.. తన ప్రభావాన్ని ఈ ఎన్నికల్లో ఎంతమేర చూపగలదన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో గెలవలేని కామ్రేడ్లు.. ఎవరైనా గెలిచేందుకు.. ఓడేందుకు మాత్రం తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సీఎం.. సీపీఐ పార్టీలు రెండు పోటీకి దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా? అంటే వారు చెబుతున్న కారణాలు అతికేలా లేవన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ఎవరికి వారు మద్దతు ఇస్తారు? అన్నది కూడా క్వశ్చన్ గా మారింది. బీజపీ మతతత్త్వ పార్టీ కావటంతో తాము మద్దతు ఇవ్వటం లేదని చెబుతున్నారు. అదే సమయంలో మరే పార్టీకి మద్దతు ఇచ్చే విషయాన్ని వారు స్పష్టం చేయటం లేదు. దీంతో.. తాము ఎవరి తరఫున పనిచేయాలో అర్థం కాక కమ్యునిస్టుపార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
ఇలాంటివేళ.. సీపీఎం స్థానిక నాయకత్వానికి తుది నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇచ్చి తాను కామ్ అయ్యింది. సీపీఐ మాత్రం కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అనువుగా నడుచుకోవాలని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి ప్రజా పోరాటాలు చేస్తున్న కమ్యునిస్టులు.. రాష్ట్రాల వరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నమైన ఎజెండాను బయటకు తీస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో రాసుకుపూసుకు తిరిగే ఆ పార్టీ నేతలు.. ఉప ఎన్నికల్లో తాము అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న సందేహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ కమ్యునిస్టుల తీరు మాత్రం కొత్త క్వశ్చన్లకు కారణమైందన్న మాట వినిపిస్తోంది.