సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరుతో ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన పుస్తకం చర్చ ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఈ పుస్తకం అమెరికా చట్టసభల్లో ప్రస్తావనకు వచ్చింది. అరిజోనాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు హరోల్డ్ ట్రెంట్ ప్రాంక్స్ ఈ విషయంపై చర్చించారు. కంచ ఐలయ్య పుస్తకంతో పాటుగా కొద్దికాలం క్రితం హత్యకు గురైన గౌరీ లంకేష్ ఉదంతాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే..ఆమెను హతం చేశారని వ్యాఖ్యానించారు.
గౌరీ లంకేష్ ని చంపడం ద్వారా భారతదేశంలో భావాప్రకటనా స్వేచ్చ కు రక్షణ లేకుండా పోయిందనీ తద్వార రచయితలందరు బయపడే సందర్భం ఉత్పన్నమయిందని హరోల్డ్ ట్రెంట్ ప్రాంక్స్ పేర్కొన్నారు. అమెరికా చట్టసభలో ఆయన ప్రసంగిస్తూ ``కంచ ఐలయ్య``పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ప్రముఖ రచయిత అయిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యను కూడా చంపాలని కొందరు వ్యక్తులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఐలయ్య భావప్రకటనా స్వేచ్చను హరిస్తున్నారని అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన హెచ్చరిక అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఎంపీ అంటూ పరోక్షంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను ప్రస్తావించారు. పుస్తక రచయిత అయిన కంచ అయిలయ్యను “నడి బజార్లో ఉరితియ్యాలి ” అని, ఆ విధంగా చట్టాన్ని మార్చాలని ఫత్వా జారిచేయడం ద్వారా “భారతదేశ ప్రజాస్వామ్య విలువలను - భావప్రకటనా స్వేచ్చ ”ను నవ్వులపాలు చేశారని పేర్కొన్నారు.
ఇలాంటి వ్యక్తుల హెచ్చరికలు - వైశ్యుల నుంచి వస్తున్న బెదిరింపుల వల్ల కంచ ఐలయ్య తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారనీ హరోల్డ్ పేర్కొన్నారు. ఈ బెదిరింపుల వలన తనకు తానే “స్వయంగా ఇంట్లోనే భందింపబడ్డాడనీ ”, బయటకీ రాలేకపోతున్నాడనీ అవేదన వ్యక్తం చేశారు. కంచ ఐలయ్యను కాపాడే భాద్యత ప్రపంచ ప్రజాస్వామ్య వాదులపై ఉందని ఆయన పేర్కొన్నారు. కంచ ఐలయ్యను రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వివరించారు.