ఆ యాడ్స్‌ ను ఆ టైంలో మాత్ర‌మే వేయాల‌ట‌

Update: 2017-12-06 17:30 GMT
చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ఇంట్లో అనుక్ష‌ణం మోగుతుండే టీవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర నిర్ణ‌యం ఒక‌టి వెలువ‌డింది. ఇంట్లో ఒక్క‌డిగా ఉండే మ‌నిషికి సైతం మ‌రో తోడు మాదిరి ఉండే చాట‌ర్ బాక్స్ లాంటి టీవీని పెద్ద‌లే కాదు.. చిన్నారులు ఎంత‌గా చూస్తారో ప్ర‌త్యేకంగా చూడాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

డిజిట‌ల్ యుగంలో అయితే సెల్ ఫోన్‌.. కాకుంటే టీవీ చూడ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది. మ‌రి.. వ‌యసుతో సంబంధం లేకుండా నిత్యం చూసే టీవీల్లో ఏ వేళ‌లో ప‌డితే ఆ వేళ‌లో కండోమ్ యాడ్స్ వేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. కండోమ్ యాడ్స్‌పై ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో.. ఈ యాడ్స్ ను ప్ర‌సారం చేసే వేళ‌ల్ని ప‌రిమితం చేయాల‌ని డిసైడ్ చేశారు.

ఈ నేప‌థ్యంలో టీవీల్లో కండోమ్ యాడ్స్ ను ప‌రిమిత వేళ‌ల్లో మాత్ర‌మే ప్ర‌సారం చేయాలంటూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది అడ్వైర్టైజింగ్ స్టాండ‌ర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌ సీఐ) .  తాజా సూచ‌న‌ల నేప‌థ్యంలో  కిర్రెక్కించే కండోమ్ యాడ్స్ ను రాత్రి ప‌ది గంట‌ల నుంచి ఉద‌యం ఆరు గంట‌ల లోపు మాత్ర‌మే ప్ర‌సారం చేయాల‌ని పేర్కొంది.

కండోమ్ యాడ్స్‌ కు సంబంధించి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఫిర్యాదుల్ని మ‌హారాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ స‌మీక్షించి  త‌మ నిర్ణ‌యాన్ని ఏఎస్‌ సీఐ చెప్పింది. ఈ నేప‌థ్యంలో తాజా నిర్ణ‌యం తీసుకున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఇటీవ‌ల ప్ర‌ముఖ తార స‌న్నీలియాన్ ఒక కండోమ్ యాడ్ చేశారు. ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ పై మ‌హారాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ప్ర‌క‌ట‌న విభాగానికి  ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ వ్య‌వ‌హారంపై స‌మీక్షించిన వారు..మొత్తం కండోమ్ యాడ్స్  టైమింగ్స్ నే మార్చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.
Tags:    

Similar News