కోమటి రెడ్డి వెంకట రెడ్డికి తనకు మధ్య కొందరు నాయకులు చిచ్చు పెడుతున్నారని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యుడని.. తాను రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తనకు, వెంకట్ రెడ్డి మధ్య అంతరాలు పెంచేలా కొందరు ప్రయత్నించి నందునే ఆయన అపార్థం చేసుకున్నట్లు చెప్పారు.
రాజగోపాల్ రెడ్డిని సొంత పార్టీని ముంచేందుకు యత్నించిన ద్రోహిగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పటికీ తమ నాయకుడేనని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటాలు, కాంట్రాక్టుల గురించి తేల్చేందుకే చండూరుకు వస్తున్నామన్న రేవంత్.. నిజాయితీ పరుడైతే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వేరు.. రాజగోపాల్ రెడ్డి వేరు. రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీకి ద్రోహం చేశాడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మా కుటుంబసభ్యుడు. నా కంటే సీనియర్ నేత.. తెలంగాణ ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ద్రోహి. నా వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి ఎలాంటి సంబంధంలేదు.
రాజగోపాల్ రెడ్డిని మాత్రమే మీరు అని సంభోదించాను. అపోహలతో మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరంలేదు. రాజగోపాల్ రెడ్డి సవాళ్లకు ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. టెండర్లు, కేసీఆర్‌పై పోరాటంపై చండూరుకు వచ్చి మాట్లాడుతా అని రేవంత్ రాజ్గోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు.
వెంకటరెడ్డి ఏమన్నారంటే..
తాను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారికి లీగల్ నోటీసులు ఇస్తానని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. కోమటి రెడ్డి బ్రాండ్ లేదనడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని వెంకట్రెడ్డి తెలిపారు. తాను నాలుగు పార్టీలు మారి రాలేదన్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇంతకుముందే కోరానని చెప్పారు. సోనియా గాంధీ తనను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారని తెలిపారు. దీనిపైనే రేవంత్ రియాక్ట్ అయ్యారు.