కోమటిరెడ్డికి ఏఐసీసీ రెండో షోకాజ్ నోటీస్.. సీల్డ్ కవర్ లో సమాధానం పంపిన వెంకటరెడ్డి

Update: 2022-11-04 10:30 GMT
మునుగోడులో బీజేపీలో ఉన్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ వెంకటరెడ్డి చేయని ప్రయత్నం లేదు. పార్టీలు మారినా ఈ బ్రదర్స్ మాత్రం ఒకరికోసం ఒకరు పనిచేశారు.దీనిపై సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం ఇదివరకే ఒక షోకాజ్ నోటీస్ పంపింది. తాజాగా మరోసారి వెంకటరెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ రెండోసారి షాకాజ్ నోటీసులు జారీ చేసింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని.. తన తమ్ముడిని గెలిపించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్స్ లీక్ అయ్యి ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. నాడు మొదటి షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

గతనెల 22న అధిష్టానం ఈ నోటీస్ ఇచ్చింది. అయితే ఆస్ట్రేలియాలో ఉన్న వెంకటరెడ్డి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డికి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

మునుగోడు ప్రచారానికి దూరంగా ఉన్న వెంకటరెడ్డి కాంగ్రెస్ తోనూ దూరం జరిగారు. అసంతృప్తిగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తికావడంతో ఇప్పుడు ఆయనపై చర్యలకు కాంగ్రెస్ దిగింది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి తరుఫున ప్రచారంలో పాల్గొనకుండా తమ్ముడి కోసం పనిచేసిన కోమటిరెడ్డి వ్యవహారంతో ఇప్పుడు అతడిని పార్టీ నుంచి సాగనంపే చర్యలు ఊపందుకున్నాయి.

ఇక ఏఐసీసీ నోటీసుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి బీజేపీకి ఓటు వేయాలన్న దానిపై ఈనెల 1న సీల్డ్ కవర్ లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.  ‘అది ఫేక్ ఆడియో అని.. నా వాయిస్ కాదు. మార్ఫింగ్ చేసింది. పార్టీలో నేను చాలా సీనియర్ ను.. ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం నుంచి పనిచేశా.. 35 ఏళ్లుగా కాంగ్రెస్ కు విధేయుడిగా ఉన్నా.. నా సీనియార్టీకి పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు’ అంటూ వెంకటరెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

మరి వెంకటరెడ్డి సమాధానికి ఏఐసీసీ ఓకే అంటుందా? లేదా? తొలగిస్తుందా? అన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News