మోడీ వ‌ల‌కు చిక్కిన కాంగ్రెస్ చేప‌!!

Update: 2022-07-30 14:30 GMT
ఎక్క‌డ ఎప్పుడు ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగాలో.. ఒక‌ప్పుడు.. కాంగ్రెస్ ను చూసి.. బీజేపీ నేత‌లు నేర్చుకున్నారు. ఒక‌సారి నిండు స‌భ‌లో.. అప్ప‌టి ప్ర‌ధాని(రాజీనామా చేసిన‌సంద‌ర్భంలో) వాజ‌పేయి.. పార్ల‌మెంటులో ప్ర‌సంగిస్తూ.. ''మీకున్న తెలివి తేట‌లు కానీ.. మీకున్న వ్యూహాలుకానీ.. మాకు ఉంటే.. ఇలా ఎందుకు.. ఉంటాం''అని వ్యాఖ్యానించారు. ఇది నిష్టుర స‌త్యం. అందుకే.. పార్టీ పెట్టిన వెంట‌నే.. బీజేపీ అధికారంలోకి రాలేక పోయింది. బ‌ల‌మైన కాంగ్రెస్ ను ఎదుర్కొన‌లేక‌పోయింది.

కానీ, ఇప్పుడు అదే బ‌ల‌మైన కాంగ్రెస్‌.. ''కుంజ‌ర యూధంబు దోమ‌కుత్తుక జొచ్చెన్‌'' అన్న‌ట్టుగా.. బీజేపీ పాల‌ప‌డి.. వ్యూహాల లేమితో.. ఆమూలాగ్రం.. అస‌మ‌తుల్య రాజ‌కీయాల‌కు పెట్ట‌ని కోటగా మారి.. ప‌త‌నావ‌స్థ దిశ‌గా ప‌రుగులు పెడుతున్న వైనం.. ప్ర‌తి కాంగ్రెస్ అభిమానినీ క‌ల‌చి వేస్తోంది. ''పిల్లలు తాగే పాల‌ప్యాకె ట్‌పై జీఎస్టీ పెంచేస్తారా?  దేశ ర‌క్ష‌ణ రంగాన్ని కాంట్రాక్టు పాలు చేస్తారా? బుల్‌డోజర్ విధ్వంసాలు, మత విద్వేషాలు రెచ్చ‌గొడ‌తారా?  మీ అంతు చూస్తాం.. స‌భ‌లోనే తేల్చుకుంటాం'' అని తొడ‌గొట్టిన కాంగ్రెస్‌.. పార్ల‌మెంటు వేదిక‌గా.. మోడీ వ‌ల‌లో చిక్కి.. హాహాకారాలు పెడుతున్న దృశ్యం క‌ళ్ల‌కు క‌నిపిస్తోంది.

''ప్ర‌స్తుతం మ‌నం నెహ్రూ కాలంలో లేం. మ‌న‌కు ప్ర‌తిప‌క్షంగా.. పుచ్చ‌ల‌ప‌ల్లి వంటి వారు కూడా లేరు. కాబ‌ట్టి.. ఎన్నిఅనుకున్నా.. స‌భ‌లోకి వెళ్లాక .. ఏం జ‌రుగుతుందో మీరు చూస్తారుగా!'' ఇదీ.. బీజేపీకి చెందిన ఒడిసా సీనియ‌ర్ మోస్ట్ ఎంపీ.. ఒక‌రు.. పార్ల‌మెంటు ప్రారంభానికి ముందు.. జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్య‌లు. దీనిని బ‌ట్టి.. స‌భ‌లో ఏం జ‌రుగుతుందో.. కాంగ్రెస్ అంచ‌నా వేసి ఉంటే బాగుండేద‌ని.. అంద‌రూ అనుకుంటున్నారు. కానీ, అలా చేయ‌లేదు.

అన‌వ‌స‌ర వివాదాల‌కు.. తావిచ్చి.. మోడీ వ‌ల‌కు చిక్కుకునేలా వ్య‌వ‌హ‌రించింది. రాష్ట్ర‌ప‌తిని ఎలా సంబో ధించాల‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇదే పెద్ద వివాదం.. అన్న‌ట్టుగా.. కేంద్రం ప‌రిగ‌ణించింది. ర‌భ స సృష్టించి.. దానిలో సోనియాను లాగి.. ఆద్యంతం కేంద్ర మంత్రులే ప్ల‌కార్డులు ప‌ట్టుకుని.. వీధి పోరాటాల‌కు దిగేలా వ్యూహం న‌డిచింది.

ఇదే.. మోడీ ఆశించారు! అక్ష‌ర స‌త్యం.. లేక‌పోతే.. అగ్నిప‌థ్ పై చ‌ర్చ జ‌ర‌గ‌దా?  ధ‌ర‌ల పెరుగుద‌ల‌.. జీఎస్టీపై.. విప‌క్షాలు నిప్పులు చెర‌గ‌వా?  అదే జ‌రిగితే.. త‌న ఏలుబ‌డిలో.. జ‌రుగుతున్న ఏకీకృత నిర్ణ‌యాలు..బ‌య‌ట‌కు రావా? అందుకే.. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వేసిన పాచిక‌కు.. కాంగ్రెస్ బ‌లి అయిపోయింది.

కొస‌మెరుపు.. ఏంటంటే.. ఇంత జ‌రిగింది.. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలుపూర్తిగా అడుగంటి పోయా యి. రెండు డ‌జ‌న్ల‌కు పైగా.. ఎంపీలు వ‌రుస స‌స్పెన్ష‌న్ల‌కు గుర‌య్యారు. మ‌రి దీనంత‌టికీ.. పాపం ఎవ‌రిది? అంటే.. కాంగ్రెస్ స‌హా.. విప‌క్షాల‌దే! ఇదీ.. మోడీ మెరుపు వ్యూహం. 'నువ్వు నా నోట్లో వేలు పెడితే.. నేను నీ కంట్లో వేలు పెడ‌తా!'' అనే సిద్ధాంతాన్నే బీజేపీ అమ‌లు చేసింది. ఫ‌లితంగా.. కార్యాకార‌ణ సంబంధంగా.. పార్ల‌మెంటు స‌మావేశాల ప్ర‌తిష్టంభ‌న‌కు .. బీజేపీ నేత‌లు.. కార‌ణం అయినా.. వెలుగు లోకి వ‌చ్చింది మాత్రం కాంగ్రెస్‌!! ఇప్పుడు చెప్పండి.. మోడీ వ‌ల‌కు.. కాంగ్రెస్ చేప చిక్కిందా?  లేదా?!!
Tags:    

Similar News