ఎక్కడైనా తప్పు చేసినోడు భయపడతాడు. కానీ.. తప్పు గురించి బయటకు చెప్పే వాడు భయపడేలా చేస్తున్న ప్రయత్నాలు రోజురోజుకి పెరుగుతున్న తీరు చూసినప్పుడు.. ఈ దేశంలో తప్పు చేసినోళ్ల హవానే నడుస్తుందా? అన్న సందేహం కలగక మానదు. బుద్ధిగా చదువుకోవటం.. జాతి నిర్మాణానికి.. దేశ అభివృద్ధికి అండగా ఉండాల్సిన క్యాంపస్ లు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా.. ఉగ్రవాదుల అడ్డాల్లో మాట్లాడుకున్నట్లుగా మాట్లాడినా దాన్ని వాక్ స్వాతంత్ర్యం అంటూ వాదిస్తున్న విపక్షాల తీరు చూస్తే విస్మయం కలగక మానదు.
దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ప్రసంగాలు చేస్తున్న విద్యార్థుల సమూహానికి కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ పార్టీలు అండగా నిలవటం.. దాన్ని భావస్వేచ్ఛగా చెప్పుకునే పెద్దమనషుల నిజస్వరూపం ఎలా ఉంటుందో తాజాగా లోక్ సభలో మరోసారి బయటపడింది. ఉగ్రవాదులకు అండగా నిలిచేలా వర్థంతి కార్యక్రమాలను భావస్వేచ్ఛగా చెప్పుకునే వారు.. అక్కడేం మాట్లాడుతుంటారన్న విషయాన్ని లోక్ సభలో మిగిలిన సభ్యులకు.. అదే సమయంలో దేశంలోని ప్రజలందరికి చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం దాన్ని తప్పు పడుతున్న తీరు విచిత్రంగా అనిపించక మానదు.
భావస్వేచ్ఛ విద్యార్థులకు మాత్రమే ఉంటుందా? ఈ దేశంలో అధికారపక్షానికి ఉండదా? విపక్షాలు ఏం చేసినా అధికారపక్షం మౌనంగా ఉండాలా? నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఎలాంటి మాటలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తారనటానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ మాటలే తాజా నిదర్శనం. జేఎన్ యూకు చెందిన కొన్ని విద్యార్థి సంఘాలు అచ్చేసిన దుర్గాదేవి పోస్టర్ గురించి మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించే క్రమంలో ఆనంద్ శర్మ అడ్డుకుంటూ.. ‘‘ప్రతి మత నేత గురించి.. ప్రతి ఒక్కరి దేవుడి గురించి ఎవరో ఒకరు అగౌరవంగా మాట్లాడి ఉంటారు. అటువంటి విషయాలన్నింటినీ సభలో ప్రస్తావించటం ఎంతవరకు సబబు? ఇది ప్రమాదకర సంప్రదాయం. సభలో యుద్ధం జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఆనంద్ శర్మ చెప్పిన మాటల్లో కాస్త నిజం లేకపోలేదు. కానీ.. జేఎన్ యూలో విద్యార్థులు చేస్తున్న చట్టవిరుద్ధ అంశాలపై ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చూస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయాల్ని చెప్పాల్సిన బాధ్యత కేంద్రమంత్రికి ఉండదా? వర్సిటీల్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కేసులు నమోదు చేస్తే దేశం మొత్తం కదిలిపోయేలా కొన్ని పార్టీ నేతలు పెడబొబ్బలు పెడుతున్నప్పుడు వివరాలు చెప్పాల్సిందే కదా? అన్న ప్రశ్నల్లో నుంచి ఆనంద్ శర్మ వ్యాఖ్యల్ని చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే.. తమకు రాజకీయ ప్రయోజనాలను అడ్డుకోవటం తప్పించి.. ఇష్టారాజ్యం చర్యల్ని అడ్డుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్న కనీస విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది.
దుర్గామాతను వేశ్యగా చిత్రీకరించటం.. ఆమెపై అత్యంత అనాగరికంగా వ్యాఖ్యలు చేసే విద్యార్థుల మేధోతనాన్ని కీర్తించే కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ నేతల మైండ్ సెట్ చేస్తుంటే.. ఈ దేశానికి ఆవల ఉండే ఉగ్రవాదులే కాదు.. దేశంలో ఉన్న కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ పార్టీల మైండ్ సెట్ కూడా ప్రమాదకరంగా మారుతుందన్న అభిప్రాయం కలగక మానదు. తప్పు చేసిన వాళ్లను తప్పు పట్టే విషయంలోనూ వెనకడుగు వేయటం.. దేవతలుగా ఆరాధించే వారిని అసభ్యంగా చిత్రీకరించి.. వారిని పూజించే వారి మనోభావాల్ని దెబ్బ తీయటం కమ్యూనిస్ట్.. కాంగ్రెస్ నేతలకు తప్పుగా కనిపించకపోవటం ఏమిటి..?