పెళ్లి పేరుతో రూమ్‌ లు బుక్‌..తాజ్‌ కృష్ణాలో హైడ్రామా

Update: 2018-05-18 12:52 GMT
క‌న్న‌డ రాజ‌కీయం హాట్ హాట్‌ గా మారుతోంది. కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారడంతో .. కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలు రిసార్ట్‌ లో ఉండ‌టం...బలపరీక్షకు గవర్నర్ మొదట 15 రోజులు గడవు ఇవ్వ‌డంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ కు వెళ్లాలంటూ హైకమాండ్ నుంచి ఆదేశాలు రావ‌డం..తెలిసిన సంగ‌తే. అయితే ఈ బ‌స వెనక సంద‌ర్భంగా అనే ట్విస్ట్‌ లు చోటుచేసుకుంటున్నారు. ఢిల్లీ పెద్ద‌ల ఆదేశాల అనుసారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఏర్పాట్లు చేశారు.  రాత్రికి రాత్రే టీపీసీసీ ఆ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ ఈ ఏర్పాట్లు చేసినట్లు ప్రాథమికంగా అర్థమవుతోంది.

అయితే ఈ ఏర్పాట్ల వెనుక పెద్ద హైడ్రామానే న‌డిచింద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత‌ కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన  ఆదేశాలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాత్రికి రాత్రే 100 ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేయాలంటూ ఆదేశించడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు. రూమ్‌ ల కోసం నగర శివారుల్లో ఉన్న రిసార్ట్‌ లను సంప్రదించారు. కానీ ఎక్కడా అవకాశం దొరకలేదు. అంతా ఫుల్ అన్న బోర్డులే ఎదురయ్యాయి. పార్క్ హయత్‌ లోనూ వంద రూమ్‌ ల కోసం ప్రయత్నించారు. అక్కడ కూడా ఫుల్ అని తెలిసింది. చివరకు తాజ్‌ కృష్ణలో ప్రయత్నం చేశారు. మ్యారేజ్ పార్టీ కోసం 100 రూమ్‌ లు కావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రూమ్‌ లను బుక్ చేశారు. గదులు - ఆహారం కోసం వాళ్లు సుమారు 12 లక్షలు కూడా డిపాజిట్ చేసినట్లు సమాచారం. కానీ ఎమ్మెల్యేలతో బస్సులు తాజ్‌ కృష్ణలో ఎంటర్ కావడంతో అక్కడున్న సిబ్బంది షాక్‌ కు గురయ్యారు. మ్యారేజ్ పార్టీ పేరుతో రూమ్‌ లు బుక్ చేశారు, కానీ ఇలా ఎమ్మెల్యేలు రావడంతో తాజ్ యాజమాన్యం సర్‌ ప్రైజ్ అయ్యింది. ఆ ఎమ్మెల్యేలకు ఎలా రక్షణ కల్పించాలన్న టెన్షన్‌ లో పడ్డారు. ఎట్ట‌కేల‌కు ఏర్పాట్లు చేశారు.

ఇదిలాఉండ‌గా...ఈ బ‌స‌లోమ‌రో ట్విస్ట్ చోట‌చేసుకుంది. నాలుగు బస్సుల్లో వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తాజ్‌ కృష్ణ హోటల్‌ లో ఉన్నారు. కర్నాటక ఎమ్మెల్యేల కోసం టీపీసీసీ నేతలు 10 రోజుల వరకు ఏర్పాటు చేశారు. కానీ సుప్రీం కోర్టు బలపరీక్షకు 24 గంటలే గడువు ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి మరోలా మారింది. సుప్రీంకోర్టు ఆదేశంతో రేపే కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్న నేప‌థ్యంలో ఈ రాత్రికే వారిని త‌ర‌లించ‌నున్నారు. కాగా,  కాసేపటి క్రితమే మాజీ సిద్ధరామయ్య కూడా అక్కడకు చేరుకున్నారు.
Tags:    

Similar News