లాక్ డౌన్: మరో ఎమ్మెల్యే ఘనకార్యం ..ఏం చేసాడంటే ?

Update: 2020-05-01 06:45 GMT
దేశంలో కరోనా మహమ్మారి చాలావేగంగా విజృంభిస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా దేశంలో క్రమకరంగా పెరుగుతూపోతోంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే , కొంతమంది మాత్రం కరోనా లాక్ డౌన్ నియమాలని పాటించడంలేదు. ఇకపోతే , ఈ లాక్ డౌన్ కారణంగా దేశంలో  అనేక పెళ్లిళ్లు నిలిచిపోయాయి. కరోనా ఎప్పుడు తగ్గుతుందా...ఎప్పుడు లాక్‌ డౌన్ ఎత్తేస్తారా అని కొన్ని జంటలు ఎదురుచూస్తున్నాయి.

అయితే , కొంతమంది ప్రజాప్రనిధులు మాత్రం తమకి లాక్ డౌన్ నియమాలు వర్తించవు. మేము ప్రజాప్రతినిధులం..మాకు కరోనా రాదు అంటూ తమకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ మద్యే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి లాక్ డౌన్ అమలులో ఉండగానే కొడుకు పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వ్యవహారం దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. అయితే , తాజాగా అదే కర్ణాటక రాష్ట్రంలో మరో ప్రజాప్రతినిధి లాక్ డౌన్ నియమాలని తుంగలో తొక్కుతూ తన కొడుకు పెళ్లిని అతిరధ మహారధులు మధ్య అంగరంగవైభవంగా నిర్వహించారు.

పూర్తి వివరాలు చూస్తే ..కరోనా లాక్ ‌డౌన్‌ నిబంధనలను గాలికి వదిలి మాజీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైభవంగా నిర్వహించారు. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ మాజీ ఎమ్మెల్యే - కాంగ్రెస్‌ నాయకుడు బీజీ గోవిందప్ప తనయుని పెళ్లి బేలూరులో జరిపారు. పెద్దసంఖ్యలో అతిథులు రావడం - కనీస దూరం - మాస్కులు లేకుండా పెళ్లి వేడుక జరిపారు. దీంతో ప్రజలకు ఒక చట్టం - పెద్దలకు మరో చట్టమా? అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వాన్ని  ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News