ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం అన్న తరహాలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటమిలతో కిందా మీదా పడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు ఆశాజనకంగా మారాల్సి ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితి అస్సలు కనిపించట్లేదు. రోజురోజుకీ బలపడుతోన్న మోడీతో కాంగ్రెస్ ఢీలా పడుతోంది. తాజాగా ఒక కొత్త వివాదంలో కాంగ్రెస్ ఇరుక్కుంది. ఇటీవల ఆ పార్టీ విడుదల చేసిన ఒక బుక్ లెట్ లో కాశ్మీర్ ను భారత ఆక్రమిత కాశ్మీర్ గా పేర్కొంటూ ముద్రించిన మ్యాప్ ఇప్పుడు వివాదాస్పదమై.. కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేలా చేసింది.
అచ్చుతప్పుగా కాంగ్రెస్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా.. అన్ని వర్గాలు మాత్రం ఆ పార్టీని తిట్టిపోస్తున్నారు. మోడీ సర్కారు మూడేళ్ల పాలనను తిట్టిపోసేందుకు తయారు చేసిన బుక్ లెట్ లో ఈ తప్పుదొర్లింది. అదే కాంగ్రెస్‌కు ఇప్పుడు కొత్త కష్టాన్ని తెచ్చి పెట్టింది. మోడీ మూడేళ్ల వైఫల్యాలపై ఆ పుస్తకాన్ని కాంగ్రెస్ నేతలు లక్నోలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ అజాద్.. రాజ్ బబ్బర్ తదితరులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
జాతీయ భద్రత విషయంలోనూ.. పాక్.. చైనాలతో సంబంధాల విషయంలోనూ మోడీ సర్కారు వైఫల్యాల్నిఇందులో ప్రస్తావించారు. ఈ క్రమంలో భారత ఆక్రమిత కాశ్మీర్ గా పేర్కొనటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాశ్మీర్‌ను ఇలా ప్రస్తావించటంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. వేర్పాటువాదులు.. పాకిస్థాన్ అభిప్రాయాన్నే కాంగ్రెస్ వ్యక్తం చేసిందని ఫైర్ అయిన కమలనాథులు.. ఈ ఉదంతంపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి పూర్తి బాధ్యతను సోనియాగాంధీ తీసుకోవాలంటున్నారు. అయితే.. ఇదంతా ప్రింటింగ్ లోపంగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నామని.. ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటామని చెబుతున్నా.. పార్టీకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయిందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన అంశాల విషయంలో తప్పులు దొర్లకుండా చూడాలి. ఆ విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగిన చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/