రాజకీయాల్లో అసాధ్యమైనది ఏదీ ఉండదు. శాశ్విత మిత్రత్వం.. శాశ్విత శత్రుత్వం కూడా ఏమీ ఉండదు. అధికారమే లక్ష్యంగా కొన్నిసార్లు సర్దుబాట్లు.. పొత్తులు పొద్దుపొడుస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనూ చోటు చేసుకోనున్నదని చెప్పాలి. వచ్చే ఏడాది జరగనున్నయూపీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆలోచిస్తున్న రెండు పార్టీలు.. ఒక జట్టు అయ్యే దిశగా ప్రయత్నాలు జరగటమే కాదు.. అవి ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బలం లేకున్నా.. పవర్ చేజిక్కించుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన అయితే.. అధికారపార్టీగా.. మరోసారి పవర్ ను తమ సొంతం చేసుకోవాలన్నది సమాజ్ వాదీ పార్టీ భావిస్తోంది.
తమకున్న మైనస్ ల్ని ప్లస్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా.. జత కట్టటమే మంచిదన్న ఆలోచనలో ఉన్నాయి సమాజ్ వాదీ.. కాంగ్రెస్ పార్టీలు. ఏదో విధంగా యూపీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు.. బలమైన సమాజ్ వాదీ పార్టీతో జట్టు కట్టటానికి మించింది లేదన్న ఆలోచన కాంగ్రెస్ లో కనిపిస్తోంది.
బీహార్ మేజిక్ ను యూపీలోనూ పునరావృతం చేసేందుకు వీలుగా.. యూపీ అధికారపక్షంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. అది నిజమేనన్న మాట యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చెప్పటం చూస్తుంటే.. యూపీ రాజకీయం ఆసక్తికరంగా మారనుందనే చెప్పాలి. అయితే.. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే విషయంలో సమాజ్ వాదీ చీఫ్ ములాయం ఎలాంటి ఆలోచనలో ఉన్నారన్నది ఇంకా బయటకు రాలేదు. అది కానీ.. బయటకు వస్తే కానీ భవిష్యత్ పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/