ఆదితీ సింగ్.. యూపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ పేరు సంచలనంగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఈ ఆదితీ సింగ్. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యి కూడా యూపీ సీఎం యోగి ని కలవడంతో ఆమె త్వరలోనే బీజేపీ గూటికి చేరబోతుందా అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా యూపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. కానీ , పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదితీసింగ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం ఆదితీసింగ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
దీనిపై ఆమె మాట్లాడుతూ ... తన రాయబరేలీ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకే తాను సీఎం యోగిని కలిశానని చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 16 లక్ష్యాల సాధనకు యూపీ సర్కారు పాటుపడుతున్న నేపథ్యంలో తాను అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరై మాట్లాడానని ఆదితీసింగ్ చెబుతున్నారు. అసలు ఆదితీ సింగ్ గురించి ఇంత హైలెట్ ఎందుకు అంటే .. గతంలో ఒకసారి ఆమె రాహుల్ గాంధీకి కాబోయే భార్య అంటూ వార్తలు వచ్చాయి. కానీ , అప్పుడు ఈ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ తనకి అన్నయ్యతో సమానం అంటూ చెప్పింది. మరో ముఖ్య విషయం ఈమె మరెవరో కాదు ..రాయ్‌బరేలీ నుంచి అయిదుసార్లు ఎన్నికైన అఖిలేష్ సింగ్ కుమార్తె.