కోర్టుకు షకీల్ కొడుకు డుమ్మా.. పోలీసులు ఏం చేయబోతున్నారంటే?
రెండేళ్ల క్రితం అజాగ్రత్తగా కారు నడిపిన సమయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కారులోనే ఉన్నాడు.
2022లో జూబ్లీహిల్స్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ర్యాష్ డ్రైవింగుతో కారును నడపడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం అజాగ్రత్తగా కారు నడిపిన సమయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కారులోనే ఉన్నాడు. అప్పట్లో అఫ్నాన్ అనే వ్యక్తి తానే కారు నడిపినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అఫ్నా్న్ పక్కనే రహీల్ కూర్చున్నట్లు పోలీసులు గతంలో కోర్టుకు తెలిపారు. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్, ఐడెంటిఫికేషన్ సరిగా లేదని వెల్లడైంది. దాంతో రహీల్ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇప్పటికీ విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
షకీల్ కుమారడు రహీల్ మద్యం తాగి కారు ర్యాష్ డ్రైవింగుతో ప్రజాభవన్ గేట్లను ఢీకొట్టాడు. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో అప్పటి నుంచి రహీల్ దుబాయి పరారయ్యాడు. ఈ ర్యాష్ డ్రైవింగుతో ఇద్దరు మరణించగా.. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మళ్లీ కేసును రీ ఓపెన్ చేశారు. రహీల్ డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు తీసినప్పటికీ.. అతనిని తప్పించి ఆ కేసులో తన డ్రైవర్‌గా ఉన్న అఫ్నాన్‌ను ఇరికించే ప్రయత్నం చేసినట్లు తేలింది. ఫింగర్ ప్రింట్స్‌తో ఆప్నాన్ నిర్దోషి అని వెల్లడైంది.
ఈ ప్రమాదం జరిగినప్పుడు షకీల్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో కావాలనే షకీల్ కొందరు అధికారుల సహకారంతో తన కుమారుడిని ఈ కేసు నుంచి సునాయసంగా తప్పించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో కేసు రీ ఓపెన్ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దుబాయిలో ఉన్న రహీల్‌కు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేశారు. దుబాయిలో ఉన్న అతడిని రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
మరోవైపు.. ఈ రోజు రహీల్ కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంది. నేడు తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. అయితే.. రహీల్ మాత్రం విదేశాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయాలని పోలీసులు ఆలోచిన్తున్నట్లు సమాచారం.