విజయ్ దివస్ ఎందుకు జరుపుకుంటాం.. భారత్‌కు ఎందుకు ప్రత్యేకం?

అది డిసెంబర్ 16, 1971. పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొడుతూ కార్గిల్‌లో భారతదేశం విజయ పతాకాన్ని ఎగురవేసిన రోజు. అప్పటి నుంచి భారతదేశం డిసెంబర్ 16ను విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నది.

Update: 2024-12-16 09:48 GMT

అది డిసెంబర్ 16, 1971. పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొడుతూ కార్గిల్‌లో భారతదేశం విజయ పతాకాన్ని ఎగురవేసిన రోజు. అప్పటి నుంచి భారతదేశం డిసెంబర్ 16ను విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నది.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ మీద పైచేయి సాధిస్తూనే ఉన్నది. భారతదేశం చేసిన యుద్ధాల్లో 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధానికి ఉన్న ప్రాధాన్యం చాలా గొప్పది. ఆ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత బలగాలు ఓడించాయి. దీని ఫలితంగానే బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. ఈ యుద్ధం ద్వారానే ఇండియన్ ఆర్మీ, వైమానిక దళం, నావికాదళంతోపాటు ఇతర సాయుధ దళాలు సత్తా చాటాయి. ఈ యుద్ధంతో మన వారి సత్తా ప్రపంచానికి తెలిసిపోయింది.

అప్పట్లో బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లో భాగంగానే ఉండేది. ఆ భూభాగాన్ని తూర్పు పాకిస్థాన్‌గా పిలిచేవారు. అక్కడి ప్రజలు స్వాతంత్ర్యం కోసం నిత్యం అలుపెరుగని పోరాటాలు చేశారు. ఆ పోరాటం ఉధృతమైన సమయంలోనే 1971 డిసెంబర్ 3న పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్ సైతం పాక్‌తో పోరాడింది. 13 రోజులపాటు యుద్ధం జరిగింది. ఈ పోరులో భారత్ పైచేయి సాధించింది. డిసెంబర్ 16న పాకిస్థాన్ సైన్యం లొంగిపోయి యుద్ధంలో ఓడిపోయినట్లుగా అంగీకరించి చేతులెత్తేసింది. దాంతో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. అప్పటి నుంచి యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగానే డిసెంబర్ 16ను భారత్, బంగ్లాదేశ్‌లో ‘విజయ్ దివస్‌’గా నిర్వహిస్తున్నారు.

1971లో జరిగిన ఎన్నికల ఫలితాలను పాకిస్థాన్ తొక్కిపెట్టడంతో బంగ్లాదేశ్ విముక్తి అనే అంశం తెరమీదకు వచ్చింది. దాంతో ఈ వివాదం యుద్ధానికి దారితీసింది. పాకిస్థాన్ నుంచి విడిపోయి సొంత దేశంగా ఏర్పాటు చేసుకోవాలని 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పిలుపునిచ్చింది. ఆ తరువాతి రోజే వారి స్వాతంత్ర్య పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతు ఇచ్చింది. అప్పట్లో పాకిస్థాన్ మిలటరీ బెంగాలీలపై, హిందువులపై ఎన్నో దారుణాలకు పాల్పడింది. ఫలితంగా సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు భారతదేశానికి వలస వచ్చారు. బెంగాలీ శరణార్థులను భారత్ ఆహ్వానించి ఆశ్రయం కల్పించింది.

పాకిస్థాన్ వైమానిక దళం మన దేశంలో వాయువ్య ప్రాంతాలకు దాడులు దిగడాన్ని భారత్ సీరియస్‌గా పరిగణించింది. ఆ తరువాత భారత్ అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ‘ఆపరేషన్ చెంగిజ్ ఖాన్’లో భాగంగా ఆగ్రా, తాజ్ మహల్‌లపై దాడులు చేసేందుకు ప్రణాళికలు చేసింది. దాంతో శత్రు దేశాల నుంచి మన కట్టడాలను కాపాడుకునేందుుకు తాజ్‌మహల్‌ను ఆకులు, కొమ్మలతో కప్పివేశారు. ప్రతిస్పందనగా భారత వైమానిక దళం సైతం వెస్ట్రన్ ఫ్రంట్‌లో పటిష్ట ఏర్పాట్లు కూడా చేసింది. యుద్ధం ముగిసే వరకు కూడా ఐఏఎఫ్ పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో నేవీ కూడా కీలక పాత్ర పోషించింది.

ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో కరాచీ పోర్టుపై భారత నావికాదళం డిసెంబర్ 4-5 తేదీల మధ్య రాత్రి దాడులకు పాల్పడింది. దాంతో పాకిస్థాన్ తమ దళాలను భారత పశ్చిమ సరిహద్దు వద్దు మోహరించింది. అప్పటికే భారత సైన్యం పాక్ భూభాగంలోకి దూసుకెళ్లింది. కొన్ని వేల కిలోమీటర్ల పాక్ భూభాగాన్ని స్వాధీనం చేసేసుకుంది. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌కు చెందిన 8వేల మంది సైనికులు చనిపోయారు. 25వేల మంది వరకు గాయపడ్డారు. అలాగే.. భారత్‌కు చెందిన 3వేల మంది సైనికులు చనిపోయారు. మరో 12వేల మంది గాయపడ్డారు. తూర్పు పాకిస్థాన్‌లోని ముక్తి బాహిని గెరిల్లా దళాలు భారత బలగాలతో చేతులు కలిపాయి. అవి కూడా భారత్‌తో కలిసి పాకిస్థాన్ సైన్యంతో పోరాడాయి. ముక్తి బాహిని గెరిల్లా సభ్యులకు భారత సైన్యం ట్రైనింగ్ ఇచ్చింది. ఆయుధాలను సైతం అందించింది. అప్పట్లో సోవియట్ యూనియన్ సైతం బంగ్లా విముక్తికి మద్దతు తెలుపగా.. అమెరికా మాత్రం పాక్‌కు సపోర్టుగా నిలిచింది. యుద్ధం తుది దశకు చేరుకునే సరికి పాక్ భారీ నష్టాలను చవిచూసింది. దాంతో జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ నేతృత్వంలోని సుమారు 93వేల పాకిస్థాన్ దళాలు భారత దళాలకు లొంగిపోయాయి. 1972లో జరిగిన సిమ్లా ఒప్పందంలో భాగంగా వారికి విముక్తిని కల్పించేశారు. ఈ యుద్ధంలో పాక్ ఆర్మీలో మూడో వంతు మంది సైన్యం చనిపోయింది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు వ్యూహాత్మకంగా పోరాడి.. దాయాది దేశంపై విజయం సాధించాయి. దాంతో అప్పటి నుంచి ఈ రోజున విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాం.

Tags:    

Similar News